Sakshi News home page

నిమిషం యాడ్‌ కోసం రూ. 10 కోట్ల ఆఫర్‌.. రిజెక్ట్‌ చేసిన అల్లు అర్జున్‌

Published Sun, Dec 17 2023 9:57 AM

Allu Arjun Rejected RS 10 Crore Add - Sakshi

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. దీంతో అతని రెమ్యునరేషన్‌తో పాటు పలు యాడ్‌ రెమ్యునరేషన్‌ కూడా పెరిగింది. సుకుమార్‌ డైరెక్ట్‌ చేసి పుష్ప నుంచి పార్ట్‌ -2 త్వరలో విడుదల కానుంది. 2024 కొత్త ఏడాదిలో బన్నీ పేరు మరోసారి పాన్‌ ఇండియా రేంజ్‌లో వెలిగిపోవడం ఖాయం. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం యాడ్స్‌ రూపంలో ప్రమోట్‌ చేయాలని కోరడం సహజం. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక మద్యం కంపెనీకి చెందిన తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయాలని కోరాయాట.

అందుకు సుమారు రూ. 10 కోట్లు ఆఫర్‌ చేశాయట. కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్‌లో కనిపిస్తే చాలని కోరాయట.. కానీ ఈ డీల్‌ను అల్లు అర్జున్‌ సున్నితంగా రిజెక్ట్‌ చేశారని సమాచారం.  మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర దుర్వ్యసనాల యాడ్స్‌లలో నటిస్తే సమాజంలో చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అయన చెప్పారట.. అందు కోసం ఎంత రెమ్యునరేషన్‌ ఇచ్చినా తాను చేయనని చెప్పి పంపించేశాడట బన్నీ. ప్రజలకు హానికరం చేసే వస్తువులను ప్రమోట్‌ చేసి వాటి ద్వారా వచ్చే డబ్బు తనకు అవసరం లేదని ఆయన ఫ్యాన్స్‌ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.

సరోగేట్‌ యాడ్స్‌ నిషేధం
మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర హానికరమైన వాటిని సరోగేట్‌ యాడ్స్‌ అంటారు. నియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండే ప్రకటనల (యాడ్స్‌) నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలను నిర్ణయించింది. ఈ మేరకు సరోగేట్‌ యాడ్స్‌ (ప్రచారం చేయడానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటి పేరుతోనే అదేరీతిలో ఉండే వేరే ఉత్పత్తులను చూపించడం)ని కూడా నిషేధించింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్  గతంలో ఒక పాన్ మసాలా  ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీ కి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన తెలిపిన విషయం తెలిసిందే.

భారతదేశంలో ఎందుకు నేరం
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం 1995 ద్వారా పొగాకు, మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తుల ప్రకటనలపై భారత్‌లో  నిషేధం ఉంది. దీంతో సెలబ్రీటిలతో ఈ సరోగేట్ ప్రకటనలు పుట్టుకొచ్చాయి. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనలు ఉండకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది.  టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003, సెక్షన్ 5 అనే చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సిగరెట్లు, పొగాకు వంటి హానకరమైన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించ కూడదని ఆ చట్టం చెబుతుంది. దీంతో ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు వాటిని ప్రమోట్‌ చేయడం లేదు.

Advertisement

What’s your opinion

Advertisement