అంబానీ ప్రీవెడ్డింగ్‌.. త్రీ ఖాన్స్‌కు భారీగా పారితోషికం?! | Sakshi
Sakshi News home page

ప్రీవెడ్డింగ్‌.. ఖాన్స్‌ త్రయంతో పాటు రామ్‌చరణ్‌కు భారీగానే ముట్టిందా?

Published Thu, Mar 7 2024 2:17 PM

Did Aamir, Salman, Shah Rukh Charge To Perform At Anant-Radhika Sangeet? - Sakshi

బాలీవుడ్‌ సెలబ్రిటీలందరినీ ఒక్కచోటకు చేర్చడం.. అది కూడా బస్సెక్కించి మరీ ఈవెంట్‌కు తీసుకురావడం ఒక్క అంబానీకే సాధ్యమైంది. తారలు సైతం తమ ఇంటి పెళ్లిలాగే భావించి అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో తెగ సందడి చేశారు. ఆటపాటలతో అలరించారు. అయితే అందరినీ కట్టిపడేసిన అంశం ఏదైనా ఉందా? అంటే త్రీఖాన్స్‌ డ్యాన్స్‌ చేయడమే!

స్టేజీపై డ్యాన్స్‌..
ఎప్పుడూ బిజీగా ఉండే షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌.. అన్నదమ్ముల్లాగా కలిసి డ్యాన్స్‌ చేయడంతో అభిమానులంతా ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఇందుకోసం డబ్బులు కూడా బాగానే తీసుకుని ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో కలిసి స్టెప్పేసిన రామ్‌చరణ్‌కు కూడా ఎంతో కొంత ఇచ్చే ఉంటారని ఎవరికి వారు అభిప్రాయపడుతున్నారు. కానీ బీటౌన్‌లో మాత్రం ప్రచారం మరోలా ఉంది. చరణ్‌తో పాటు ఈ ఖాన్స్‌ త్రయానికి డబ్బులే ఇవ్వలేదట!

సంతోషంతోనే..
'వారిని ఒకే స్టేజీపైకి తీసుకురావాలని అప్పటికప్పుడు అనుకున్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంబానీ అంత గ్రాండ్‌గా ఆతిథ్యం ఇచ్చినప్పుడు అతిథులు డబ్బులు అడగ్గలరా? ఆ హీరోలు సంతోషంతో అలా డ్యాన్స్‌ చేశారంతే.. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేదు' అని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంబానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని మెచ్చిన హీరోలు ఫ్రీగా డ్యాన్స్‌ చేశారన్నమాట! అయినా ఇది ప్రీవెడ్డింగ్‌ కాబట్టి డిమాండ్‌ చేయలేదేమో.. పెళ్లికి అసలు, వడ్డీ.. అంతా కలిపి అడుగుతారని.. అప్పటిదాకా ఓపిక పట్టండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Advertisement
 
Advertisement
 
Advertisement