ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే | Gaami And Om Bhim Bush Movies Released In OTT, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Gaami-Om Bhim Bush OTT Release: ఓటీటీల్లోకి రెండు క్రేజీ మూవీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Fri, Apr 12 2024 7:20 AM

Gaami And Om Bhim Bush Movies Streaming In OTT - Sakshi

ఓటీటీలోకి మరో రెండు క్రేజీ సినిమాలు వచ్చేశాయి. గత కొన్నాళ్లుగా అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే రాలేదు. వచ్చినా కూడా ఒకటి అరా వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా రెండు మూడు క్రేజీ చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి అనేది చూసేద్దాం.

(ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్)

గత నెలలో శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'గామి'. దాదాపు ఆరేళ్లపాటు షూటింగ్ చేసి మరీ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ అఘోరాగా నటించడం విశేషం. టాక్ పరంగా పాజిటివ్ వచ్చినప్పటికీ డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే ఇది నచ్చింది. ఇప్పుడు అందరికోసమా అన్నట్లు జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో  పాటు తమిళ, కన్నడ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

అలానే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓం భీమ్ బుష్' అనే సినిమా కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లాజిక్స్ లేని కామెడీతో తీసిన ఈ చిత్రం.. గతనెల చివరి వారంలో రిలీజైంది. ఇప్పుడు మరీ 3 వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ వీకెండ్ ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ రెండు మూవీస్ బెస్ట్ ఆప్షన్.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?)

Advertisement
Advertisement