ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్‌.. ధర ఎన్ని కోట్లంటే? | Sakshi
Sakshi News home page

Kareena Kapoor: లగ్జరీ కారు కొన్న కరీనా కపూర్.. ధరెంతో తెలుసా?

Published Thu, Oct 19 2023 10:34 AM

Kareena Kapoor buys a new Land Rover India Defender luxury Worth 1 crore - Sakshi

బాలీవుడ్ భామ కరీనా కపూర్‌ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్‌ రోవర్ డిఫెండర్‌ ఎస్‌యూవీ కారును సొంతం చేసుకుంది. ఈ కారు విలువ దాదాపు రూ.1.2 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. ప్రస్తుతం కరీనా కపూర్‌ ప్రధాన పాత్రలో హన్సల్‌ మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని కరీనా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో జస్‌ భమ్రా అనే డిటెక్టివ్‌గా కరీనా కనిపించనుంది.

ఈ పాత్ర గురించి కరీనా మాట్లాడుతూ..' ఇరవై మూడేళ్లుగా ఈ పాత్ర కోసమే ఎదురుచూస్తున్నా. డిటెక్టివ్‌ నేపథ్యంలో తెరకెక్కే పాత్రలకి నేను పెద్ద అభిమానిని. కరమ్‌చంద్‌, హెలెన్‌ మిరెన్‌, అగాథా క్రిస్టీలాంటి రచయితల కథలతో తెరకెక్కిన సిరీస్‌లు చూశా. ఇలాంటి పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధమని' చెప్పుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో యశ్‌ టాండన్‌, రణ్‌వీర్‌ బ్రార్‌, కీత్‌ అలెన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రాన్ని శోభా కపూర్‌, ఏక్తా కపూర్‌, కరీనాకపూర్‌ నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement