ఏపీ ఫైబర్ నెట్‌లో ఆర్జీవీ ‘వ్యూహం’, ‘శపథం’ | Sakshi
Sakshi News home page

ఏపీ ఫైబర్ నెట్‌లో ఆర్జీవీ ‘వ్యూహం’, వెబ్‌ సిరీస్‌గా ‘శపథం’, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Published Thu, Mar 7 2024 5:49 PM

RGV Vyuham, Sapatham To Release In AP Fiber Net - Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’. గత శనివారం(మార్చి 2) థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్సార్‌ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలను తనదైన శైలీలో తెరపై చూపించాడు ఆర్జీవీ. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం కాకుండా చేసేందుకు అటు కాంగ్రెస్‌, ఇటు టీడీపీ చేసిన కుట్రలను.. వాటన్నింటిని ఎదుర్కొని వైఎస్‌ జగన్‌ ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగాడనేది ఈ చిత్రం ద్వారా చూపించాడు.

(చదవండి: వ్యూహం' సినిమా రివ్యూ)

దీనికి సీక్వెల్‌గా ‘శపథం’అనే చిత్రం ఈ నెల 8న విడుదల కావాల్సింది. రిలీజ్‌ డేట్‌ని కూడా గత వారమే ప్రకటించారు. కానీ ఇప్పుడీ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్‌ కావడం లేదు. వెబ్‌ సిరీస్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. శపథం ఆరంభం, శపథం అంతం అంటు రెండు భాగాలుగా ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు ఆర్జీవీ. 

‘వ్యూహం , శపథం ల వెనుక మా అసలు వ్యూహం సైడ్ బై సైడ్ వెబ్ సిరీస్ కూడా తియ్యటం. కానీ కొన్ని కారణాల వల్ల  తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బోర్డు అనుమతించిన  వెర్షన్ మాత్రమే  థియేటర్లలో రిలీజ్ చెయ్యడం జరిగింది.  కానీ ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి  రెడీ చేసి పెట్టుకున్న వెబ్ సిరీస్ శపథం ఆరంభం చాప్టర్ 1 ని ఈ రోజు(మార్చి 7) సాయంత్రం 8 గంటలకు, శపథం అంతం చాప్టర్ 2ని రేపు(మార్చి 8) సాయంత్రం 8 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా పే పర్‌ వ్యూలో చూసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం.

ఆ తర్వాత అంచెలంచెలుగా అన్ని ఓటీటీ ప్లాట్ ఫాంలలో రిలీజ్‌ అవుతాయి. శపథం ఆరంభం చాప్టర్ 1 , శపథం అంతం చాప్టర్ 2 రెండు కూడా తీసిన  ఉద్దేశ్యం ఏమీ దాచకుండా పచ్చి నిజాలు చూపిస్తాం’ అని ఆర్జీవీ అన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రోగ్రాంలో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమా రిలీజ్‌ చేస్తున్నామని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అలాగే  ఓటీటీ ద్వారా శపథం వెబ్ సిరీస్‌ని విడుదల చేస్తున్నామని అన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement