రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి! | Sakshi
Sakshi News home page

Tamil Star Hero Vijay: విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. అదే ప్రధాన అస్త్రంగా!

Published Sun, Aug 27 2023 1:20 PM

Tamil Star Hero Vijay Political Entry Ground Work Started In Social Media - Sakshi

తమిళస్టార్ హీరో విజయ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. అంతే కాకుండా విజయ్‌ ప్రజాసంఘం ఇప్పుడు సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ మరింత బలంగా ముందుకు సాగే ప్రయత్నానికి సిద్ధం అవుతోంది. ఇది చూస్తుంటే విజయ్‌ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

(ఇది చదవండి: అల్లు అర్జున్‌కే అవార్డు అని ముందే హింట్‌ ఇచ్చిన రష్మిక.. వీడియో వైరల్‌)

ఆయన అభిమానులు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో పలు వార్డుల్లో పోటీ చేసి గెలుపొందారు. విజయ్‌ రంగప్రవేశమే తదుపరి అనే ప్రచారం జోరుగా సాగుతుంది. విజయ్‌ ఆంజనేయ సంఘం ఇప్పటికే ప్రజాసంఘంగా మార్చి రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది.

కాగా.. ఈ సంఘం ద్వారా పలు విభాగాలను ఏర్పాటు చేశారు. తాజాగా సామాజిక మాధ్యమాలను వాడుకునే ప్రయత్నం చేశారు. ఇందులోభాగంగా శనివారం ఉదయం విజయ్‌ అభిమాన సంఘం కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ నేతృత్వంలో పనైయూర్‌లోని విజయ్‌ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన అభిమానులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో సామాజిక మాధ్యమాల కోసం 30 వేల మందిని నియమించారు.

బుస్సీ ఆనంద్‌ మాట్లాడుతూ విజయ్‌ ప్రజా సంఘాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. తమ సంఘానికి చెందిన ప్రతి విషయాన్ని ప్రజల్లోకి చేరే విధంగా వాట్సాప్‌లను వినియోగించాలని చెప్పారు. అదే విధంగా 234 నియోజకవర్గాల్లో జరిగే విషయాలను క్లుప్తంగా వీడియోలో చిత్రీకరించి సంఘం ప్రధాన నిర్వాహకునికి పంపించాలని కోరారు. అలాంటి వాటిని ప్రధాన నిర్వాహకుల అనుమతి  లేకుండా ప్రచారం చేయరాదన్నారు. అదేవిధంగా ఏ విషయంలోనూ కుల,మత వివక్షతకు పాల్పడరాదని సూచించారు. 

(ఇది చదవండి: ఎవరైనా ప్రపోజ్ చేశారా?.‍. హీరోయిన్ శ్రీలీల క్రేజీ కామెంట్స్?)


 

Advertisement
 
Advertisement
 
Advertisement