లండన్‌లో కోనూరు విద్యార్థి మృతి Indian Student Died in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో పల్నాడు కోనూరు విద్యార్థి మృతి

Published Tue, Jun 11 2024 8:38 AM

Indian Student Died in London

మృతదేహాన్ని తెప్పించాలని కోరుతున్న తల్లిదండ్రులు  

పల్నాడు జిల్లా:   మండల పరిధిలోని కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం (25) ఈ నెల 2న లండన్‌లోని మాంచెస్టర్‌లో గల పాకిస్తాన్‌ పోర్ట్‌ బీచ్‌లో మృతి చెందాడు. ఈ విషయం స్థానిక పోలీసుల ద్వారా సోమవారం తల్లిదండ్రులకు తెలిసింది.  రాష్ట్ర పోలీస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ సీఐడీ విభాగం నుంచి అచ్చంపేట పోలీస్‌ స్టేషన్‌ కు సమాచారం రావడంతో అచ్చంపేట పోలీసులు  విషయాన్ని తమకు తెలియచేసినట్లు కోనూరులో ఉంటున్న  సాయి తల్లిదండ్రులు గుంటుపల్లి ఏడుకొండలు, అన్నపూర్ణలు తెలిపారు.

తమ కుమారుడు బీటెక్‌ విజయవాడలోని కె.ఎల్‌.యూనివర్సిటీలో పూర్తిచేసి లండన్‌లో జాబ్‌ చేస్తూ ఎంటెక్‌ చదివేందుకు 2021లో వెళ్లినట్లు తెలిపారు. ఈ నెల 2న బీచ్‌లో మృతి చెందినట్లు పోలీసుల ద్వారా తెలుసుకున్నామన్నారు. అయితే ఎందువల్ల మృతి చెందాడో విషయం తమకు తెలియదన్నారు.  

మృతదేహాన్ని తెప్పించండి  
తమ కుమారుడు సాయిరాం మృతదేహాన్ని తమ స్వగ్రామమైన కోనూరుకు తెప్పించేందుకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు చొరవ చూపాలని తల్లిదండ్రులు గుంటుపల్లి ఏడుకొండలు, అన్నపూర్ణలు కోరుతున్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement