Sairam
-
లండన్‌లో కోనూరు విద్యార్థి మృతి
పల్నాడు జిల్లా: మండల పరిధిలోని కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం (25) ఈ నెల 2న లండన్‌లోని మాంచెస్టర్‌లో గల పాకిస్తాన్ పోర్ట్ బీచ్‌లో మృతి చెందాడు. ఈ విషయం స్థానిక పోలీసుల ద్వారా సోమవారం తల్లిదండ్రులకు తెలిసింది. రాష్ట్ర పోలీస్ ఎన్ఆర్ఐ సెల్ సీఐడీ విభాగం నుంచి అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు సమాచారం రావడంతో అచ్చంపేట పోలీసులు విషయాన్ని తమకు తెలియచేసినట్లు కోనూరులో ఉంటున్న సాయి తల్లిదండ్రులు గుంటుపల్లి ఏడుకొండలు, అన్నపూర్ణలు తెలిపారు.తమ కుమారుడు బీటెక్ విజయవాడలోని కె.ఎల్.యూనివర్సిటీలో పూర్తిచేసి లండన్‌లో జాబ్ చేస్తూ ఎంటెక్ చదివేందుకు 2021లో వెళ్లినట్లు తెలిపారు. ఈ నెల 2న బీచ్‌లో మృతి చెందినట్లు పోలీసుల ద్వారా తెలుసుకున్నామన్నారు. అయితే ఎందువల్ల మృతి చెందాడో విషయం తమకు తెలియదన్నారు. మృతదేహాన్ని తెప్పించండి తమ కుమారుడు సాయిరాం మృతదేహాన్ని తమ స్వగ్రామమైన కోనూరుకు తెప్పించేందుకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చొరవ చూపాలని తల్లిదండ్రులు గుంటుపల్లి ఏడుకొండలు, అన్నపూర్ణలు కోరుతున్నారు. -
చంద్రబాబు బెయిల్‌పై అడ్వకేట్ సాయిరాం కామెంట్స్
-
డీఈఓ సాయిరామ్‌కు గుండెపోటు
రాప్తాడురూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎం.సాయిరామ్ శనివారం గుండెపోటుకు గురయ్యారు. ఉదయం నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. తనకు కడుపు నొప్పిగా ఉందని భార్య ఉమాకు చెప్పి బెడ్రూమ్లో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో భార్య పిలిచినా డీఈఓ నుంచి స్పందన లేదు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లారు. గట్టిగా కేకలు వేయడంతో ఇంటివద్దే ఉన్న ఏపీఓ నారాయణస్వామి, కంప్యూటర్ ఆపరేటర్ హరికృష్ణ, డ్రైవరు హుటాహుటిన కారులో తీసుకొచ్చి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తదితరులు ఆస్పత్రికి వచ్చి డీఈఓ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. రోదిస్తున్న భార్య ఉమాను ఓదార్చారు. గుండెకు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ బ్లాక్ కావడం, ఊపిరిత్తుల్లోకి ఆహారం చేరుకోవడంతో కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్ వైద్యులకు సూచించారు. డీఈఓ అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో డీఈఓ, సమగ్ర శిక్ష కార్యాలయాల సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, హెచ్ఎంలు ఆస్పత్రికి తరలివచ్చారు. ఉదయమంతా సరదాగా గడిపిన డీఈఓ.. ఉదయం నుంచి డీఈఓ సాయిరామ్ సరదాగా గడిపారు. నగర శివారులోని టీటీడీసీలో జరుగుతున్న రీజనల్‌స్థాయి ప్రధానోపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. గాయకుడైన డీఈఓ ఈ సందర్భంగా ‘ఇదే కదా ఇదే కదా నీకథ...ముగింపు లేనిదై సదా సాగదా’ అంటూ మహర్షి సినిమాలో పాట పాడి అందరినీ ఆకర్షించారు. అక్కడి నుంచి సమగ్ర శిక్ష కార్యాలయానికి చేరుకుని ఎంఈఓల సమావేశంలో పాల్గొన్నారు. అందరితో హుషారుగా గడిపారు. ఇక్కడి నుంచి 3 గంటల సమయంలో ఇంటికి బయల్దేరారు. కాగా... డీఈఓ గతంలోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే స్టంట్‌కూడా వేయించుకున్నారు. డీఈఓ త్వరగా కోలుకోవాలని విద్యాశాఖ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తున్నారు. -
బొట్లపాలెం ఘటనలో నిందితుల అరెస్ట్
ఒంగోలు టౌన్/దర్శి: కులాంతర వివాహం కేసులో దళిత మహిళను బంధించి పెట్రోలు పోసి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మలికా గర్గ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దర్శి మండలం బొట్లపాలేనికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మరెడ్డి, పుల్లమ్మల కుమార్తె భార్గవి.. అదే గ్రామానికి చెందిన దళితుడు జక్కుల సాయిరాంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని బ్రహ్మారెడ్డి దంపతులు ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మంచినీళ్లు పట్టుకునేందుకు కొళాయి వద్దకు వెళ్లిన సాయిరాం తల్లి అనురాధ, సోదరి కామునూరి మౌనిక మీద దాడి చేసి విచక్షణరహితంగా కొట్టారు. మౌనికను దుస్తులు చింపేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. తమ ఇంటి వరండాలో ఆమెను తాళ్లతో కట్టేసి పెట్రోలు పోసి హతమార్చేందుకు యత్నించారు. అయితే ఈ లోపు అనురాధ స్థానికుల సాయంతో 100కు కాల్ చేయడంతో వెంటనే దర్శి ఎస్ఐ డి.రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యువతిని కాపాడారు. చికిత్స నిమిత్తం పోలీస్ వాహనంలో దర్శి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఐపీఎస్ అంకితా సురాన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసిన దర్శి డీఎస్పీ టి.అశోక్‌వర్థన్.. మంగళవారం మధ్యాహ్నం తూర్పు గంగవరం బస్టాండ్ సెంటర్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నిముషాల్లోపే అక్కడికి చేరుకున్న పోలీసులు గంటలోపే కేసు రిజిస్టర్ చేశారు. వీలైనంత త్వరగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వివరించారు. కాగా, దళిత మహిళలపై దాడి ఘటనలో నిందితులు గంగిరెడ్డి బ్రహా్మరెడ్డి, భార్య పుల్లమ్మలకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ బుధవారం దర్శి ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
హైదరాబాద్‌లో ‘స్టెమ్ సెల్’ ల్యాబ్!
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో దేశంలోనే అతి పెద్ద స్టెమ్ సెల్ తయారీ ప్రయోగశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ‘స్టెమ్ క్యూర్స్ కంపెనీ’ప్రకటించింది. సుమారు 54 మిలియన్ డాలర్ల (సుమారు రూ.440 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ తయారీ యూనిట్‌తో 150 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో స్టెమ్ క్యూర్స్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సాయిరాం అట్లూరి బోస్టన్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీతో పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు మన దేశంలో విస్తృతంగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కాగా ప్రపంచ వైద్య ఆవిష్కరణలకు తన సొంత నగరమైన హైదరాబాద్ హబ్‌గా మారిందంటూ సాయిరాం సంతోషం వ్యక్తం చేశారు. నల్లగొండలో సొనాటా కార్యకలాపాలు నల్లగొండలో ప్రారంభం కానున్న ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సొనాటా సాఫ్ట్వేర్ ముందుకు వచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ ఐటీ టవర్‌లో సొనాటా సాఫ్ట్వేర్ 200 ఉద్యోగాలు కల్పిస్తుంది. బోస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సొనాటా సాఫ్ట్వేర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీని వీరవెల్లి ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఇందుకూరి తదితరులు భేటీలో పాల్గొన్నారు. నగరానికి ప్లూమ్, సనోఫీ, పై హెల్త్ కమ్యూనికేషన్స్ సర్విస్ ప్రొవైడర్స్ (సీఎస్పీ), వారి సబ్‌స్రై్కబర్లకు సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) అనుభూతిని కలిగించిన వేదిక ‘ప్లూమ్’హైదరాబాద్‌లో వంద మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. జయేశ్ రంజన్‌తో ప్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ ఈదర భేటీ సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ ఫార్మా సంస్థ సనోఫీ 350 ఉద్యోగులతో ఒక సెంటర్‌ను ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో సమగ్ర కేన్సర్, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ‘పై హెల్త్’సహ వ్యవస్థాపకులు డాక్టర్ బాబీ రెడ్డి ప్రకటించారు. నిక్కీ హేలీతో కేటీఆర్ భేటీ ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి, సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీతో కేటీఆర్ భేటీ అయ్యారు. భారత్, యూఎస్ సంబంధాల్లో హైదరాబాద్, తెలంగాణకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతపై చర్చించారు. ఆర్థిక, ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా లోతుగా చర్చించడంతో పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న నిక్కీ హేలీని మంత్రి అభినందించారు. -
బుడతడు.. గుండె ఆగినంత పనిచేశాడు..
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఓ చిన్నారి ఆడుకుంటూ తల్లి స్నానానికి వెళ్లిన రూమ్‌కు బయట గడియ పెట్టేశాడు. ఆ తర్వాత ఆడుకుంటూ బాల్కనీలోని గ్రిల్స్‌లో కాలు పెట్టగా అది ఇరుక్కుపోయి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాత్రూమ్లో ఉన్న తల్లికి బయట ఏం జరిగిందో తెలియక గుండె ఆగినంత పని అయ్యింది. రెండు మూడు గంటల ఉత్కంఠకు ఫైర్ సిబ్బంది రాకతో తెరపడింది. వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం ప్రకాశ్‌నగర్‌లోని సాయిరాఘవ టవర్స్ మూడో అంతస్తులో ఎం.సంతోషలక్ష్మి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఆమెకు ఏడాదిన్నర బాబు (సాయిరామ్) ఉన్నాడు. మంగళవారం ఉదయం సాయిరామ్‌ను తీసుకుని తల్లి బాత్రూమ్కు వెళ్లింది. ఎప్పటిలా స్నానం చేయించి రూమ్ బయటకు వదిలింది. తర్వాత తానూ స్నానానికి ఉపక్రమించింది. ఇంతలో ఆ బాలుడు బాత్రూమ్ డోర్ వద్ద ఆడుకుంటూ గడియ పెట్టేశాడు. అక్కడి నుంచి నెమ్మదిగా బాల్కనీలోకి వచ్చాడు. బాల్కనీలోని గ్రిల్లో కాలు పెట్టగా ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాకపోయేసరికి గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. బాబు ఏడుపు బాత్రూమ్ నుంచి విన్న తల్లి బయటకు రాలేక, బాబుకు ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళన చెందింది. ఏం చేయాలో తెలియక గట్టిగా కేకలు వేసింది. కింది భాగంలో నివాసం ఉంటున్న వారు విని పైకి వచ్చారు. లోపలికి వెళ్దామంటే మెయిన్ డోర్ వేసి ఉంది. లోపల ఏం జరుగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అపార్టుమెంటుకు చేరుకుని నిచ్చెన ద్వారా పైకి ఎక్కి బాల్కనీలోని గ్రిల్స్‌లో ఇరుక్కున్న బాలుడి కాలు బయటకు తీశారు. తర్వాత లోనికి వెళ్లి బాత్రూమ్ గడియ తీయడంతో తల్లి సంతోషలక్ష్మి బయటకు వచ్చింది. ఇద్దరూ క్షేమంగానే ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
సీఎం జగన్‌పై అరబిందో సీఓఓ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో అంబులెన్స్ వాహనాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అరబిందో ఫార్మా ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) సాయిరామ్ స్వరూప్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 104, 108 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించడం ద్వారా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో 108 లు ఏర్పాటు చేశామని అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2015లో స్థాపించిన ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు. ప్రతి గ్రామంలో అంబులెన్స్ సేవలు అందేలా ఏర్పాటు చేశామన్నారు. (దేశం మొత్తం చూసేలా చాటి చెప్పాం : సీఎం జగన్) 108 ద్వారా 3558 మందికి అంబులెన్స్‌లో ఉద్యోగాలు ముఖ్యమంత్రి కల్పించారని సాయిరామ్ స్వరూప్ అన్నారు. జిల్లాలలో శిశు మరణాలు తగించడానికి ప్రణాళిక కూడ పెట్టామని, అత్యాధునిక పరిజ్ఞానంతో అంబులెన్సు ద్వారా అందరికి మెరుగైన వైద్యం అందిచవచ్చన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కరోనాకు ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. 108,104 సర్వీసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యపరంగా కొత్త విప్లవాన్ని చూస్తారన్నారు.(‘చంద్రబాబు.. ఇలా అయినా సంతోషించు’) -
నాన్న ఇంటికి రాలేదు!
తెలుగులో డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారిని బాగా మెప్పించిన ఓ సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా స్క్రీన్‌ప్లే పరంగా చూపిన కొత్తదనం, చేసిన ప్రయోగం గుర్తించి, గుర్తుంచుకోదగ్గది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.. సాయిరామ్‌కు మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చి రెండు రోజులైంది. సాయిరామ్ కంటే మేనేజర్ అయ్యేందుకు ఎక్కువ అర్హతలున్న విశ్వనాథ్ రెండు రోజుల్నుంచి ఆఫీస్‌కు రాలేదు. ఆఫీస్‌కు వచ్చుంటే విశ్వనాథే మేనేజర్ అయ్యేవాడేమో! విశ్వనాథ్ ఎక్కడున్నాడు? సాయిరామ్ ఆలోచిస్తున్నాడు. ప్రమోషన్ వచ్చిన ఆనందం లేదు అతని కళ్లలో. విశ్వనాథ్ గురించే ఆలోచిస్తున్నాడు. ‘‘నాన్న ఇంకా ఇంటికి రాలేదంకుల్!’’ విశ్వనాథ్ కూతురు ముందురోజు రాత్రి ఫోన్లో చెప్పిన మాటలు సాయిరామ్‌కు పదేపదే గుర్తొస్తున్నాయి. అతనలా ఆలోచనల్లో ఉండగానే బేకరీ డెలివరీ బాయ్ ఒకతను వచ్చి, విశ్వనాథ్ ఆర్డర్ చేశాడంటూ కేక్ ఇచ్చి వెళ్లాడు. విశ్వనాథ్ తన కూతురు పుట్టినరోజు కోసం ఆర్డర్ చేసిన కేక్ అది. ఆ కేక్ తీసుకెళ్లి, విశ్వనాథ్ ఇంటికెళ్లాడు సాయిరామ్. విశ్వనాథ్ భార్య, కూతురు విశ్వనాథ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా, ఏదో చెడు వార్త వినడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. ‘‘ఆయన ఎక్కడికెళ్లారో మీకు తెల్సా?’’ అడిగింది విశ్వనాథ్ భార్య. తెలీదన్నట్టు తలూపాడు సాయిరామ్. ఇంట్లో చిన్న చిన్న గొడవలనీ, ఎంత గొడవ జరిగినా, రాత్రి ఫ్రెండ్స్ ఇంట్లో పడుకుని, తెల్లారేసరికల్లా వచ్చేస్తారనీ, పాప ఫోన్ చేస్తుందని ఫోన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుకుంటారనీ, పాప రాత్రినుంచి ఏమీ తినలేదని, వాళ్ల నాన్న వచ్చేదాకా ఏమీ తిననని కూర్చుందని, ఆయన ఎక్కడున్నారో తెలిస్తే ఇంటికి రమ్మని చెప్పండంటూ విశ్వనాథ్ భార్య చెప్తూ పోతోంది. సాయిరామ్ నోటినుంచి ‘సరే’ తప్ప ఇంకేమాటా బయటకు రావడం లేదు. సాయిరామ్ లేచి, ఇంటి బయటకొచ్చి, బండి స్టార్ట్ చేశాడు. ఇంట్లోనుంచి పాప.. ‘‘అంకుల్.. అంకుల్.. ఆగండి!’’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘‘మా నాన్నకు కోపమొచ్చినప్పుడు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లరు. ఎక్కడికెళ్తారో నాకు తెలుసు. అక్కడికి తీసుకెళ్తారా? ప్లీజ్..’’ బతిమిలాడింది పాప. సాయిరామ్ తన బండిమీద పాపను ఎక్కించుకొని వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లాక, మెయిన్‌రోడ్ మీదనే ఉన్న ఒక బార్‌ను చూడడమే.. ‘‘ఇక్కడే.. ఇక్కడే..’’ అంటూ బండి ఆపింది పాప. ‘‘ఈ పైనే అంకుల్..’’ అంది ఆ పాప.‘‘మీ నాన్న డ్రింక్ చేయడు. ఏదో సరదాగా చెప్పుంటాడు..’’‘‘లేదంకుల్! మా నాన్న నాతో అస్సలు అబద్ధాలు చెప్పరు. ఒకసారి వెళ్లి చూద్దాం.. ప్లీజ్..’’ అంది పాప. నేను వెళ్లి చూసొస్తానంటూ సాయిరామ్ ఆ బార్ ఉన్న కాంప్లెక్స్ పై ఫ్లోర్‌కి వెళ్లాడు. కానీ సాయిరామ్‌కు తెలుసు.. అక్కడ విశ్వనాథ్ ఉండడని. చుట్టూ చూసినట్టు నటించాడు. విశ్వనాథ్ అక్కడ లేడని పాపతో చెప్పాడు. టెర్రస్‌పైన చూశారా? అక్కడ చూడండంటూ పాప మళ్లీ బతిమిలాడింది. సాయిరామ్ టెర్రస్ మీదకు వెళ్లకుండానే వెళ్లి చూసినట్టు, విశ్వనాథ్ అక్కడ కూడా లేడని పాపతో చెప్పాడు. సాయిరామ్‌కు ఎంత ప్రయత్నించినా ఏడుపు తన్నుకొస్తోంది. పాప ముందు మాత్రం స్థిరంగా నిలబడి, ‘‘మీ నాన్న ఎక్కడున్నా నేను తీసుకొస్తాను..’’ అని పాపకు ధైర్యమిచ్చే ప్రయత్నం చేశాడు. అదే సమయానికి సాయిరామ్‌కు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘నమస్తే సార్! నా పైసలు రెడీనా?’’ అని ఆ గొంతు పలికింది. ఫోన్లోని వ్యక్తి సాయిరామ్‌తో డబ్బులకోసం బేరాలు సాగిస్తున్నాడు. సాయిరామ్ ఒక లెక్క చెబుతూంటే, ఫోన్లోని వ్యక్తి అంతకు ఎన్నోరెట్లు కావాలంటున్నాడు.‘రేయ్ దాస్! ఇది మోసంరా.. నేన్నిన్ను నమ్మాను..’’ అన్నాడు సాయిరామ్.‘‘నీకంటే పెద్ద మోసగాడినా? ఆ విశ్వనాథ్ నీతోనే పనిచేశేటోడు.. ఆణ్నే నువ్వు మోసం చెయ్యాలని చూసినవ్..’’.. దాస్ మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘అవున్రా.! నాదే తప్పు. చెంపలు వేసుకుంటున్నా. వాణ్ని వదిలెయ్‌రా..’’ అంటూ బతిమిలాడుతున్నాడు సాయిరామ్. ‘‘నా బండమ్మి పాతికవేలు ఇస్తాన్రా..’’ ఏడుస్తూ అడిగాడు సాయిరామ్. ‘‘నీ బాధలు ఇంటుంటే ఏడుపొస్తోంది సాబ్! నా బాధలు చెప్తే నువు గుడ ఏడుస్తవ్. విశ్వనాథ్ ఏడున్నడో చెప్పాలంటే లక్షా యాభైవేలు రెడీ చేస్కో..’’ ఆ చివరి మాట చెప్పాక దాస్ ఫోన్ కట్ చేశాడు. సాయిరామ్‌కు విశ్వనాథ్ ఎక్కడున్నాడో తల్చుకోవాలంటేనే భయంగా ఉంది. తనకు ప్రమోషన్ వచ్చేంత వరకు విశ్వనాథ్‌ను ఆఫీస్‌కు రాకుండా చేయమని సాయిరామ్ దాస్‌కు డబ్బులు ఇచ్చాడు. దాస్ సాయిరామ్ ప్లాన్‌ను తిప్పికొట్టి ఎక్కువ డబ్బుకోసం విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేసి తానొక్కడికే తెలిసిన ప్లేస్‌లో ఉంచాడు. దాస్ అడిగినంతా ఇస్తే తప్ప విశ్వనాథ్ దొరకడు.సాయిరామ్ సరిగ్గా ఆ నిమిషం నుంచి పిచ్చోడిలా తిరిగాడు డబ్బుల కోసం. వాళ్లనడిగి, వీళ్లనడిగి డబ్బు కూడగట్టుకున్నాడు. విశ్వనాథ్ జాడ చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి దాస్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఫోనొచ్చింది. ‘‘పైసల్ తీస్కొని ఆల్వాల్ స్టేషన్‌కి రా.. అక్కడ బ్రిడ్జీ ఎక్కి సరిగ్గా మధ్యలో ఆగు. కింద రెండో నెంబర్ ప్లాట్‌ఫాం మీద నేను కనిపిస్తా. పైసలు బ్రిడ్జి మీద పెట్టు. విశ్వనాథ్ ఏడున్నడో బల్లమీద చీటీ రాసి పెడతా. తేడా వస్తే నీ దోస్ నీకు కనిపించడు. యాదుంచుకో..’’ దాస్ చెప్పాల్సిందంతా చెప్పి ఫోన్ కట్ చేశాడు. సాయిరామ్ ఆల్వాల్ స్టేషన్‌కి వెళ్లి బ్రిడ్జి ఎక్కి, మధ్యలో ఆగి చూశాడు. దాస్ కనిపించాడు. పిలిచాడు. అతను పలకలేదు. గట్టిగా పిలిచాడు. అయినా అతను పలకలేదు. సాయిరామ్ పరిగెత్తుకుంటూ దాస్ కూర్చొని ఉన్న బెంచీ దగ్గరికెళ్లి చూశాడు. దాస్ అప్పుడే బెంచీ మీద వాలిపోతూ ఉన్నాడు. సాయిరామ్ అతణ్ని కదిలించి చూశాడు. అతను అప్పుడే చివరిశ్వాస విడిచాడు. సాయిరామ్ వణికిపోతూ అతణ్నుంచి దూరంగా కదిలాడు. చుట్టూ జనం చేరారు. విశ్వనాథ్ ఎక్కడున్నాడో చనిపోయిన దాస్‌కు మాత్రమే తెలుసు. -
తాగి కొడుతుంటే.. కాల్చేశాను!
బొమ్మనహళ్లి: నేనెందుకు నా భర్తపై కాల్పులు జరుపుతాను? తాగిన మైకంలో భర్త కొడుతుంటె నన్ను నేను రక్షించుకోవడం కోసం ఫైరింగ్ చేశానని శుక్రవారం సాయంత్రం భర్త సాయిరామ్ పైన కాల్పులు జరిపిన అతని భార్య హంసవేణి పోలీసుల విచారణలో తెలిపారు. శనివారం విచారణ కోసం చందాపుర సమీపంలోఉన్న సూర్య సిటి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆ విధంగా చెప్పారు. భర్త ఆరుపెగ్గులు, నేను బీర్లు తాగా ‘బ్యాంకు పని మీద నేను, నా భర్త సాయిరామ్ తో కలిసి హోసూరు వెళ్ళి హరళూరులో ఉన్న మా నివాసానికి తిరిగి వస్తున్నా. చందాపుర సమీపంలో రెస్టారెంటులో ఇద్దరం మద్యం తాగాం. భర్త ఆరు పెగ్గుల విస్కీ, నేను రెండు బీర్లు తాగాను. మద్యం తాగుతున్న సమయంలోనే మా ఇద్దరి మధ్య గొడవైంది. రెస్టారెంటులోనే రివాల్వర్ తీసి నా ముఖం మీద కొట్టాడు. దాంతో నాకు నోట్లోంచి, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. కారులో వెళ్తుంటే మళ్లీ గొడవైంది. నన్ను నేను రక్షించుకోవడం కోసం కాల్పులు జరిపాను. నాది బెంగళూరు, నా భర్తది ఆంధ్రప్రదేశ్. 27 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరివీ శ్రీమంతుల కుటుంబాలు కావడంతో ఇద్దరం కలిసి మందు తాగుతాం’ అని హంసవేణి చెప్పుకొచ్చింది. ఖాకీలకు ముప్పుతిప్పలు ప్రస్తుతం సాయిరామ్ చందాపుర స్పర్శ ఆస్పత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్నాడు. ఎద, కడుపులో మూడు బుల్లెట్లు దిగాయి. మరో 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. మద్యం మత్తులో, భర్త పైన ఫైరింగ్ చేసిన మత్తులో ఉన్న హంసవేణి పోలీసులతో కూడా గొడవకు సిద్ధపడ్డారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలం నుంచి తీసుకుని వెళ్తుండగా పోలీసులపై ఆమె మండిపడింది. భర్తను ఎందుకు షూట్ చేశావు చెప్పమ్మా అంటే నేనేమైనా మీకు అమ్మనా అంటూ, సరే, చెప్పండి మేడం అంటే.. నేనేమైనా మీకు టీచర్నా, స్కూళ్లో పాఠాలు చెప్పానా? అని ఆమె ఖాకీలనే నిందితురాలు ముప్పుతిప్పలు పెట్టింది. -
భర్తను బస్సు దించి రివాల్వర్‌తో కాల్పులు
-
భర్తను బస్సు దించి రివాల్వర్‌తో కాల్పులు
బెంగళూరు: మద్యం సేవించి వివాహిత హల్ చల్ చేయడంతో పాటు ఏకంగా భర్తను బస్సునుంచి కిందకు దించి రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపింది. అడ్డు వచ్చిన ప్రజలపై గన్ ఎక్కు పెట్టింది. దగ్గరకు వచ్చారో కాల్చి పారేస్తానని వీరంగం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం హెబ్బగోడి సమీపంలోని విరసంద్ర గేట్ వద్ద చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని హరళూరులో సాయిరామ్, హంసవేణి దంపతులు నివాసం ఉంటున్నారు. సాయిరామ్(53) సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఓగా పనిచేస్తున్నాడు. చందాపుర సమీపంలోని మ్యాక్స్ రెసిడెన్సిలో శుక్రవారం సాయంత్రం సాయిరామ్ దంపతులు మద్యం సేవించి కారులో బయల్దేరారు. మార్గం మధ్యలో ఏదో విషయంపై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో వాహనం వీరసంద్ర గేట్ సమీపంలోకి రాగానే భర్త సాయిరామ్ కారు దిగి బీఎంటీసీ బస్సు ఎక్కాడు. ఇక అంతే.. ఆగ్రహించిన భార్య కారును వేగంగా బస్సు ముందుకు తీసుకొచ్చి ఆపింది. భర్తను బలవంతంగా బస్సునుంచి కిందకు దింపి రివాల్వర్‌తో మూడుసార్లు కాల్పులు జరిపింది. దీంతో మూడు బుల్లెట్లు కడుపు, ఎద బాగంలో దూసుకెళ్లాయి. స్థానికులు ఆమెను నిలువరింపేందుకు యత్నించగా వారిపై రివాల్వార్ ఎక్కు పెట్టి మిమ్మల్ని కూడా కాల్చిపారేస్తానంటూ బెదిరించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని రివాల్వార్ స్వాధీనం చేసుకొన్నారు. గాయపడిన సాయిరామ్‌ను చికిత్స నిమిత్తం స్పర్శా ఆస్పత్రికి తరలించారు. సాయిరామ్‌కు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సరికొత్త థ్రిల్
సాయిరామ్ శంకర్, రేష్మిమీనన్ జంటగా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నేనో రకం’. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీధర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రం కొత్తగా ఉంటుంది. సాయిరామ్–శరత్ కుమార్ల నటన, వారిద్దరి మధ్య సన్నివేశాలు ఆడియన్స్‌కు సరికొత్త థ్రిల్‌ను కలిగిస్తాయి. మహిత్ స్వరపరచిన పాటలను టాప్ సెలబ్రిటీస్ త్వరలో రిలీజ్ చేస్తారు’’ అన్నారు. ‘‘మా చిత్రం ప్రేక్షకులను అలరించటంతో పాటు, ఆలోచింపచేసేలా ఉంటుంది. ఆసక్తికరమైన కథతో థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం’’ అని సాయిరామ్ శంకర్ చెప్పారు. ‘‘మా చిత్రానికి కథే హైలెట్. ఈ నెల 17న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
డోర్నకల్ : నాలుగు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామపంచాయతీ పరిధిలోని జర్పులతండాకు చెందిన జాటోత్ లక్ష్మణ్, సత్యవతి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుదవారం ఉదయం లక్ష్మణ్, సత్యావతి తండా సమీపంలోని మిరపతోటకు కూలి పనులకు వెళ్లగా చిన్న కుమారుడు సాయిరాం(4) తల్లిదండ్రులతో పాటు తోటకు వెళ్లాడు. తోట ఇంటి పక్కనే ఉండటంతో సాయిరాం తల్లిదండ్రుల కంటే ముందే ఇంటికి చేరుకుని ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టిలో పడిపోయాడు. కొద్ది సేపటికే భోజనం కోసం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కాళ్లు కడుక్కునేందుకు నీటి తొట్టి వద్దకు రాగా సాయిరాం అందులో కనిపించడంతో కంగారు పడి వెంటనే బయటకు తీశారు. అప్పటికే సాయిరాం మృతి చెందాడు. -
నీళ్ల తొట్టిలో పడి చిన్నారి మృతి
డోర్నకల్: ఆడుకుంటూ నీళ్ల తొట్టి వద్దకు వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం చిరుకోడు పంచాయతీ జర్పుల తండాలో ఈ విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన జాటోతు లక్ష్మణ్, సత్యవతి కుమారుడు సాయిరాం(3) బుధవారం ఉదయం నీటి తొట్టి వద్ద ఆడుకుంటున్నాడు. అందులో ఉన్న చిన్న బకెట్‌ను అందుకునే ప్రయత్నంలో నీటి పడిపోయాడు. కుటుంబసభ్యులు గమనించి, బయటకు తీసేసరికే చిన్నాని ప్రాణాలు కోల్పోయాడు.