తాగి కొడుతుంటే.. కాల్చేశాను! | accused Hamsaveni clarification on firing incident | Sakshi
Sakshi News home page

తాగి కొడుతుంటే.. కాల్చేశాను!

Published Mon, May 8 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

తాగి కొడుతుంటే.. కాల్చేశాను!

తాగి కొడుతుంటే.. కాల్చేశాను!

బొమ్మనహళ్లి: నేనెందుకు నా భర్తపై కాల్పులు జరుపుతాను? తాగిన మైకంలో భర్త కొడుతుంటె నన్ను నేను రక్షించుకోవడం కోసం ఫైరింగ్‌ చేశానని శుక్రవారం సాయంత్రం భర్త సాయిరామ్‌ పైన కాల్పులు జరిపిన అతని భార్య హంసవేణి పోలీసుల విచారణలో తెలిపారు. శనివారం విచారణ కోసం చందాపుర సమీపంలోఉన్న సూర్య సిటి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆ విధంగా చెప్పారు.

భర్త ఆరుపెగ్గులు, నేను బీర్లు తాగా
‘బ్యాంకు పని మీద నేను, నా భర్త సాయిరామ్‌ తో కలిసి హోసూరు వెళ్ళి హరళూరులో ఉన్న మా నివాసానికి తిరిగి వస్తున్నా. చందాపుర సమీపంలో రెస్టారెంటులో ఇద్దరం మద్యం తాగాం. భర్త ఆరు పెగ్గుల విస్కీ, నేను రెండు బీర్లు తాగాను. మద్యం తాగుతున్న సమయంలోనే మా ఇద్దరి మధ్య గొడవైంది. రెస్టారెంటులోనే రివాల్వర్‌ తీసి నా ముఖం మీద కొట్టాడు. దాంతో నాకు నోట్లోంచి, ముక్కులో నుంచి రక్తం వచ్చింది. కారులో వెళ్తుంటే మళ్లీ గొడవైంది. నన్ను నేను రక్షించుకోవడం కోసం కాల్పులు జరిపాను. నాది బెంగళూరు, నా భర్తది ఆంధ్రప్రదేశ్‌. 27 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరివీ శ్రీమంతుల కుటుంబాలు కావడంతో ఇద్దరం కలిసి మందు తాగుతాం’  అని హంసవేణి చెప్పుకొచ్చింది.

ఖాకీలకు ముప్పుతిప్పలు
ప్రస్తుతం సాయిరామ్‌ చందాపుర స్పర్శ ఆస్పత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్నాడు. ఎద, కడుపులో మూడు బుల్లెట్లు దిగాయి. మరో 48 గంటలు గడిస్తే గానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. మద్యం మత్తులో, భర్త పైన ఫైరింగ్‌ చేసిన మత్తులో ఉన్న హంసవేణి పోలీసులతో కూడా గొడవకు సిద్ధపడ్డారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలం నుంచి తీసుకుని వెళ్తుండగా పోలీసులపై ఆమె మండిపడింది. భర్తను ఎందుకు షూట్‌ చేశావు చెప్పమ్మా అంటే నేనేమైనా మీకు అమ్మనా అంటూ, సరే, చెప్పండి మేడం అంటే.. నేనేమైనా మీకు టీచర్‌నా, స్కూళ్లో పాఠాలు చెప్పానా? అని ఆమె ఖాకీలనే నిందితురాలు ముప్పుతిప్పలు పెట్టింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement