ఓటీటీ ‍ప్రియులకు పండగే.. ఈ వారం 15 చిత్రాలు స్ట్రీమింగ్! | Here are the latest OTT releases this week See inside for more details. - Sakshi
Sakshi News home page

This week Ott Releases: ఓటీటీల్లో ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్‌.. ఆ మూడే స్పెషల్!

Published Mon, Apr 1 2024 5:06 PM

This week Ott Releases From April 01 to 07 List Goes Viral - Sakshi

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఇక రాబోయే రెండు నెలల్లో విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. ఈ హాలీడేస్‌లో ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేది ఒక్క ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే. ముఖ్యంగా సినీ ప్రియుల కోసం ఈ వారంలో అలరించేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి.

ఈ వారం థియేటర్లలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్‌ తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ చిత్రం మాయవన్‌ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్‌లో ప్రాజెక్ట్‌-జెడ్ పేరుతో రిలీజవుతోంది. వీటితో పాటు భరతనాట్యం, సస్పెన్స్‌ థ్రిల్లర్ మూవీ బహుముఖం లాంటి చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. 

‍అయితే ఈ వారంలో ఓటీటీలోనూ సందడి చేసేందుకు పలు చిత్రాలు వచ్చేస్తున్నాయి. గోపీచంద్ నటించిన భీమా, టాలీవుడ్ భామ దివి చిత్రం లంబసింగి, హనుమాన్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. దీంతో పాటు బాలీవుడ్ మూవీ ఫర్రీ ఓటీటీకి వచ్చేస్తోంది. అంతే కాకుండా పలు వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందో మీరు ఓ లుక్కేయండి. 
  

నెట్‌ఫ్లిక్స్‌

  • టుగెదర్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02
  • ఫైల్స్‌ ఆప్‌ ది ఆన్‌ఎక్స్‌ప్లెయిన్‌డ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03
  • రిప్ లే(వెబ్ సిరీస్)-  ఏప్రిల్ 04
  • పారాసైట్- ది గ్రే(కొరియన్ సిరీస్)- ఏప్రిల్  05
  • స్కూప్- హాలీవుడ్ సినిమా- ఏప్రిల్ 025

అమెజాన్ ప్రైమ్

  • మ్యూజికా(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 04
  • యే మేరీ ఫ్యామిలీ(వెబ్ సిరీస్)- సీజన్ 3- ఏప్రిల్ 04
  • హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్- (హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • లంబసింగి- (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02
  • భీమా (టాలీవుడ్ చిత్రం) ఏప్రిల్ 5
  • హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05

జీ5

  • ఫర్రీ- (బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05

యాపిల్ టీవీ ప్లస్

  • లూట్ సీజన్‌- 2(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03
  • సుగర్(హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05

సోనీలివ్

  • ఫ్యామిలీ ఆజ్‌ కల్(హిందీ సినిమా)- ఏప్రిల్ 03


 

Advertisement
Advertisement