లిక్కర్‌ కేసు: కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు | Chief Minister Arvind Kejriwal Judicial Custody In Delhi Liquor Scam Case Extended Till May 7 - Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు: కేజ్రీవాల్‌ కస్టడీ 14 రోజులు పొడిగింపు

Published Tue, Apr 23 2024 3:13 PM

Arvind Kejriwal Judicial Custody In Liquor Case Extended Till May 7 - Sakshi

న్యూఢిల్లీ: లిక్కర్‌ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. తిరిగి మే 7న కేజ్రీవాల్‌ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.

కేజ్రీవాల్‌ను లిక్కర్‌ కేసులో మార్చ్‌ 21న ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  అరెస్టు చేసింది. కాగా, తనకు ప్రైవేట్‌ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు 

Advertisement

తప్పక చదవండి

Advertisement