ఐపీఎల్-2024లో డూఆర్‌డై మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. శుక్రవారం (మే 3) వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 54 పరుగులు సాధిస్తే.. కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ డేవిడ్ వార్నర్‌ను రోహిత్ అధిగమిస్తాడు.
కాగా ఇప్పటివరకు కేకేఆర్‌పై 32 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 1040 పరుగులు చేశాడు. ఈ జాబితాలో వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కేకేఆర్‌పై 32 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 1093 పరుగులు చేశాడు. అదే విధంగా హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో మరో 39 పరుగులు చేస్తే.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు.
ఈ జాబితాలో రోహిత్ ప్రస్తుతం 6526 పరుగులతో నాలుగో స్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 6564 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment