‘నీట్‌’కు ఏర్పాట్లు పూర్తి | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు ఏర్పాట్లు పూర్తి

Published Sat, May 4 2024 12:53 AM

‘నీట్‌’కు ఏర్పాట్లు పూర్తి

ఎర్రవల్లిచౌరస్తా: జిల్లాలో ఆదివారం నిర్వహించే నీట్‌ (యూజీ) ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సిటీ నీట్‌ కోఆర్టినేటర్‌ వెంకటేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని సరస్వతి ఇంటర్‌నేషనల్‌ పాఠశాలను ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో నీట్‌ ప్రవేశ పరీక్ష సెంటర్లుగా నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయని, దీనిలో ఎర్రవల్లి సరస్వతి పాఠశాలలో 200 మంది విద్యార్థులు, అలంపూర్‌ మాంటిస్సోరి పాఠశాలలో 312మంది, శాంతినగర్‌ రాఘవేంద్ర పాఠశాలలో 288 మంది, వీరాపురం విద్యానికేతన్‌ పాఠశాల నందు 312 మంది విద్యార్థులు.. మొత్తం 1112 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20గంటల వరకు పరీక్ష ఉంటుందని, హాజరయ్యే విద్యార్థులు అరగంట ముందే తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. విద్యార్థులు తమ వెంట హాల్‌ టికెట్‌, పాస్‌ఫొటో, గుర్తింపుకార్డు తప్పక తీసుకురావాలని ఆయన సూచించారు.

Advertisement
Advertisement