‘హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు’.. సుప్రీంకోర్టుకు మాజీ సీఎం సోరెన్‌ | Sakshi
Sakshi News home page

‘హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు’.. సుప్రీంకోర్టుకు మాజీ సీఎం సోరెన్‌

Published Thu, Apr 25 2024 4:33 PM

Former Jharkhand CM Hemant Soren Files Plea in SC Against Money laundering case - Sakshi

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కొత్త పిటిషన్‌ దాఖలు చేశారు.

తన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదంటూ తాజా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న వాదనలు పూర్తి కాగా, హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసిందని.. ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదని లేదని తెలిపారు. ఈ మేరకు సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. అత్యవసర విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
చదవండి: కవిత బెయిల్‌పై మే మొదటి వారంలో తీర్పు

హైకోర్టు తీర్పు నిరాకరించడం వల్ల  తరువాత ఏం చేయాలనే విషయంలో సోరెన్‌ ప్రతిష్టంభనలో ఉన్నారని పేర్కొన్నారు. చట్టపరమైన పరిష్కారాల కోసం ఆయన ముందుకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. తాము మళ్లీ హైకోర్టుకు వెళ్లి కనీసం తీర్పు ఇవ్వాలని కోరినా జడ్జి ఏం స్పందించలేదని చెప్పారు. సోరెన్‌ ఇక జైల్లోఏ ఉంటారా? లోక్‌సభ ఎన్నికలు కూడా ముగిసిపోతాయి. అప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం’ అని తెలిపారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా .. ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ ఈ అంశాన్ని విచారించే తేదీలను ప్రకటిస్తుందని పేర్కొన్నారు. 

కాగా మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోరెన్‌ను జనవరి 31న అరెస్టు చేసింది.  ఈ కేసులో గతంలోనే సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఫిబ్రవరి 2న హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం తెలిపింది.  సోరెన్‌ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. 

Advertisement
Advertisement