Karnataka Family Parrot Giving to Gujarat Zoo - Sakshi
Sakshi News home page

ఆ చిలుకలు ఇక చాలు.. జూకి ఇచ్చేస్తాం: అర్జున్, రంజన

Published Fri, Aug 19 2022 4:03 PM

Karnataka family Parrot Giving to Gujarat Zoo - Sakshi

సాక్షి, బెంగళూరు(తుమకూరు): కొన్నిరోజుల క్రితం తమకు ఇష్టమైన రామచిలుకను పోగొట్టుకొని దానిని పట్టుకోవడం కోసం రూ.80 వేల నజరానా ప్రకటించిన తుమకూరు వాసి కథ తెలిసే ఉంటుంది. అర్జున్, రంజన దంపతులు కొన్నేళ్లుగా బూడిద రంగు రామచిలుకలను ఎంతో మురిపెంగా పెంచుకుంటున్నారు.  వాటికి రుస్తుమా, రియో అనే పేర్లు పెట్టి నిత్యం రకరకాల పండ్లతో పోషిస్తున్నారు.

ఇటీవల రుస్తుమా ఎక్కడికో ఎగిరిపోయింది, దానిని పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పట్టించినవారికి రూ. 80 వేల బహుమానాన్ని ప్రకటించగా, ఓ వ్యక్తి దానిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఈ ఉదంతం దేశమంతటా వార్తల్లో నిలిచింది. ఇక వాటిని గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మృగాలయానికి ఇచ్చేస్తామని  తెలిపారు. తరచూ ఎగిరిపోతుంటే ఇబ్బందిగా ఉందని చెప్పారు.   

చదవండి: (లవర్‌తో భార్య పరార్‌.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య)

Advertisement
 
Advertisement
 
Advertisement