మాల్‌లో విషాదం: తండ్రి చేతుల్లోంచి జారిపడి.. | Sakshi
Sakshi News home page

వీడియో: మాల్‌లో విషాదం.. తండ్రి చేతుల్లోంచి జారిపడి చంటిబిడ్డ మృతి

Published Wed, Mar 20 2024 10:12 AM

Raipur Mall Incident: Kid Fall From Fathers Arm Leads Death - Sakshi

కుటుంబంతో సరదాగా గడుపుదామని షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆ కుటుంబానికి శోకం మిగిలింది. తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాదిన్నర బిడ్డ కన్నుమూసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 

ఎస్కులేటర్‌ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్నాడు. ఆ టైంలో ఆ వ్యక్తి ఐదేళ్ల కొడుకు ముందుకు వెళ్తుండడంతో.. నిలువరించేందుకు ఆ తండ్రి యత్నించాడు. ఈ లోపు చేతిలో ఉన్న బిడ్డ జారి కింద పడిపోయాడు. మూడో అంతస్థు నుంచి పడిపోవడంతో ఆ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

మాల్‌ సీసీటీవీ కెమెరాల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డు అయ్యాయి.  ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపర్చొచ్చు.. సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement