రెండు గ్రామాల్లో అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

రెండు గ్రామాల్లో అగ్ని ప్రమాదం

Published Mon, Apr 8 2024 1:15 AM

వేపాడలో కాలిపోతున్న మొక్కలు - Sakshi

వేపాడ: మండలంలోని వేపాడ, జాకేరు గ్రామాల్లో ఆ దివారం అగ్ని ప్రమాదాలు జరిగాయి. మండలకేంద్రం వేపాడ రెవెన్యూ పరిధిలో నూలుమెట్టపై ఉన్న మెట్టుగర్వుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 ఎకరాల్లో గల మామిడి, టేకు, నీలగిరి, సరుగుడు తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.ఆరులక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేసినట్లు ఎస్‌.కోట అగ్నిమాపకశాఖాధికారి ఉదయ్‌కుమార్‌ తెలిపారు. ఈ ప్రమాదంలో ఆదపురెడ్డి అప్పారావు, ఎన్‌.సత్యనారాయణ, ఎన్‌.మురళి, వేండ్రపు అప్పారావు, మల్లునాయుడు తదితర రైతులు తోటలు కాలిపోయినట్లు చెప్పారు. అలాగే జాకేరు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గుమ్మాల జగ్గారావు గడ్డివాము, అగ్నికి ఆహుతైంది. ఈ రెండు ప్రమాదాల్లో ఎస్‌.కోట అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడంతో నష్టం కొంతవరకు తగ్గింది. జాకేరులో జరిగిన నష్టం సుమారు రూ.18 వేలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

జాకేరులో గడ్డివాము, వేపాడలో జీడి, సరుగుడు, నీలగిరి తోటలు దగ్ధం

Advertisement
Advertisement