Sakshi News home page

‘ICEతో బీజేపీకి సంబంధం లేదు’

Published Fri, Mar 29 2024 7:57 AM

Anurag Thakur says ED CBI Are Independent Nothing To Do With Us - Sakshi

న్యూఢిల్లీ: ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్టుమెంట్‌, ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ),సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేష్‌న్‌(సీబీఐ) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడని దేశంలో ఒక్కరు కూడా ఆరోపణలు చేయాలేరన్నారు.

‘2013లో ఢిల్లీ సీఎం అసలు రాజకీయాల్లోకి అడుగుపెట్టనన్నారు. కాంగ్రెస్‌తో ఎట్టిపరిస్థితుల్లో జత కట్టనని అన్నారు. ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీ వారి సొంతంగా ఏం సాధించలేదు. రోజూ కాంగ్రెస్‌, ఆప్‌  ప్రధాని మోదీని దూషిస్తారు వాళ్లు మోదీని ఎంత దూషిస్తే.. బీజేపీ అభ్యర్థులను ప్రజలు అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటారు’ అని అన్నారు. 

‘ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు జారీచేసింది. ఎందుకు హాజరు కాలేదు. మళ్లీ విలువల గురించి మాట్లాడతారు. ఆయన ఈడీ ఆఫీసుకు హాజరకాకపోతే.. ఈడీనే ఆయన ఇంటికి వెళ్లింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆప్‌ ఒక్కసీటు కూడా గెలవలేదు. మళ్లీ 2024 ఎన్నికలో సైతం ఆప్ ఒక్కసీటు గెలవదు. ఈ రోజుకీ జైలులో ఉండి కూడా కేజ్రీవాల్‌ విలువల గురించి మాట్లాడుతున్నారు’ అని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ విమర్శలు చేశారు. ఇక.. ‘ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ఈడీ, సీబీఐ’(ఐసీఈ) స్వతంత్ర సంస్థలని వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. 

ప్రతిపక్షాల ఇండియా కూటమిపై కూడా కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాల కూటమి నిజాయితీగా ఉంటే కూటమి పేరు ఎందుకు మార్చారు? అని ప్రశ్నించారు. వాళ్లు(కాంగ్రెస్‌) 2జీ, సబ్‌మెరైన్‌, బోగ్గు కుంభకోణాలు చేశారు. వారు ప్రజలకు ముఖం చూపించలేరు. ఆ తర్వాత దాణా కుంభకోణం చేసిన లాలు ప్రసాద్‌ యాదవ్‌ను కూటమిలోకి చేర్చుకున్నారు. జైలుకెల్లిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూటమిలో ఉన్నారు’ అని అనురాగ్‌  ఠాకూర్‌ ఎద్దేవా చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement