ఒట్టేసి దేవుడితో రాజకీయాలా?  | Sakshi
Sakshi News home page

ఒట్టేసి దేవుడితో రాజకీయాలా? 

Published Thu, Apr 25 2024 4:41 PM

Bandi Sanjay nomination today

దేశం, ధర్మం అంటే బీజేపీని విమర్శిస్తారా 

సీఎం రేవంత్‌పై సంజయ్‌ ధ్వజం 

బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 

నేడు బండి సంజయ్‌ నామినేషన్‌ 

కరీంనగర్‌ టౌన్, చొప్పదండి: సీఎం రేవంత్‌రెడ్డి దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో బుధవారం పలువురు యువకులు బీజేపీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ రేవంత్‌ ఎక్కడికెళ్లినా దేవుడి మీద ఒట్టేస్తున్నారని, అదే దేవుళ్లపై బీజేపీ నేతలు మాట్లాడితే మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశం, ధర్మం గురించి బీజేపీ మాట్లాడితే అది రాజకీయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 

బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి చేరికలు 
వేములవాడ రూరల్‌ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోపు బాలరాజు ఆధ్వర్వంలో వందలాది మంది బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. చొప్పదండికి చెందిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు శ్రీరాం ముదిరాజ్‌ సహా వందలాది మంది, మానకొండూర్‌ మండలం కొండపల్కలకు చెందిన వందమందికిపైగా బీజేపీలో చేరారు. 

బండి నామినేషన్‌కు భూపేంద్రపటేల్‌
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ గురువారం ఉదయం 11.30 గంటలకు కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్‌ భాయ్‌ పటేల్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సమక్షంలో నామినేషన్లు సమరి్పంచనున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. 

గుజరాత్‌ సీఎం షెడ్యూల్‌ ఇదీ 
గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ ఉదయం 7 గంటలకు గుజరాత్‌ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 10 గంటలకు కరీంనగర్‌ చేరుకుంటారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో కలిసి ఓపెన్‌టాప్‌ జీప్‌లో ర్యాలీలో పాల్గొంటారు. టవర్‌సర్కిల్‌ వద్ద కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. నామినేషన్‌ కార్యక్రమం అనంతరం నాగర్‌కర్నూలు వెళ్తారు. అక్కడ బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొని తిరిగి గుజరాత్‌కు వెళ్తారు. 

Advertisement
Advertisement