27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్‌ విషయం..! | China Woman Discovers She Is A Biological Male After Doctors Found Testicle In Her Stomach | Sakshi
Sakshi News home page

27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్‌ విషయం..!

Published Tue, May 7 2024 3:45 PM

China Woman Discovers She Is A Biological Male After Testicle

వైద్యశాస్త్రానికే అంతుపట్టని కొన్ని విషయాలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తాయి. ఇది శాపమా? లేక పాపమా? అన్నంత బాధను కలగజేస్తాయి. ఏం చేయాలో తోచని స్థితి. అలాంటి భయానక పరిస్థితినే మహిళగా జీవిస్తున్న చైనాకు చెందిన అమ్మాయి ఎదుర్కొంటోంది. అది కూడా పెళ్లి కుదిరాక ఈ పరిస్థితి ఎదరవ్వడంతో ఆమెతో సహ తల్లిదండ్రలు కూడా నిశ్చేష్టులైపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి వద్దు అని విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు.

ఏం జరిగిందంటే..? చైనాలోని 27 ఏళ్ల మహిళ లీ యువాన్‌కి గత కొద్దిరోజుల ముందే పెళ్లి కుదిరింది. తనకు రుతుక్రమం రాకపోవడంతో ఆందోళన చెంది వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు 18 ఏళ్ల సమయంలోనే ఈ పరిస్థితిని ఎదుర్కొంది. అసాధారణ హర్మోన్‌ స్థాయిలు, సంభావ్య అండాశయ వైఫల్యం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఆమెను క్రోమోజోమ్‌ పరీక్ష కూడా చేయించుకోమని సూచించారు. అయితే లీ, ఆమె కుటుంబం ఆ సలహను పట్టించుకోలేదు. 

కానీ ఇప్పుడు పెళ్లి కుదరడంతో లీ కుటుంబం ఆమెకు వైద్య పరీక్షలు చేయించింది. ఆ పరీక్షల్లో వాళ్లంతా జీర్ణించుకోలేని నిజం బయటపడింది. వైద్యులు ఆమె పొత్తి కడుపులో వృషణాలు ఉండటా గుర్తించారు. ఆమెకు పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్‌ప్లాసియా (CAH) అనే అరుదైన రుగ్మత ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. ఈ అరుదైన రుగ్మత సుమారు 50 వేల మంది నవజాత శిశువుల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇన్నాళ్లు స్త్రీగా జీవిస్తున్న లీ ఇప్పుడూ వైద్య పరీక్షల్లో మగదిగా గైనకాలజిస్ట్‌ డువాన్‌ జీ తేల్చి చెప్పారు. 

ఆమెలో మగ క్రోమోజోమ్‌లు ఉన్నాయన్నారు. దీంతో లీకి ఒక్కసారిగా తన జీవితం అంతా తలకిందులైనట్లు అనిపించింది. ముఖ్యంగా లీ తల్లిందడ్రుల ఈ విషయం విని జీర్ణించుకోలేని అయోమయానికి గురయ్యారు. నిజానికి ఈ డిజార్డర్‌కి కారణమయ్యే జన్యువులు లీ తల్లిదండ్రులిద్దరు కలిగి ఉన్నారు. కాబట్టే లీకి ఈ పరిస్థితి ఎదురయ్యిందని చెప్పారు వైద్యులు. ఆ వైద్య పరీక్షల్లో లీ బోలు ఎముకల వ్యాధితో విటమిన్‌ డీ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేగాదు పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తక్షణమే తొలగించాలని, లేనట్లయితే క్యాన్సర్‌కి దారితీస్తుందని చెప్పారు. 

దీంతో లీకి వైద్యలు ఏప్రిల్‌ మొదటి వారంలోనే శస్త్ర చికిత్స నిర్వహించి పొత్తి కడుపులో ఉన్న వృషణాలను తొలగించారు. ఆమెకు ఇప్పుడు రెగ్యూలర్‌ ఫాలో అప్‌ పరీక్షలు, దీర్ఘకాలిక హార్మోన్‌ థెరపీ చేస్తున్నారు. ప్రస్తుతం లీ కథ ఇప్పుడు చైనాలోని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవ్వుతుంది. నెట్టింట లీ పట్ల సానుభూతి వెల్లువెత్తడమే గాక ఆమె ధైర్యాన్నికొనియాడుతున్నారు. కాగా, పుట్టకతో వచ్చే ఈ డ్రినల్ హైపర్‌ప్లాసియా (CAH) అనేది మనిషి అడ్రినల్ గ్రంధులను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత. ఈ గ్రంథులు శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ప్రధానంగా లైంగిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

(చదవండి: 'ఇరానీ చాయ్‌'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్‌ కేఫ్‌లు ఎక్కడ ఉన్నాయంటే..)
 

 
Advertisement
 
Advertisement