వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం

Published Wed, May 8 2024 12:45 AM

వైభవం

బొమ్మనహాళ్‌: స్థానికంగా వెలసిన వేంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి వేంటేశ్వరస్వామి కల్యాణోత్వసం మంగళవారం వైభవంగా జరిగింది. శ్రీనివాసుడిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలంకరణ, కుంకుమార్చన, అభిషేకం, పంచామృతాభిషేకం, సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం ఏడు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటరమణస్వామిని గరుడ వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. పల్లకీలో గ్రామ వీధుల్లో ఊరేగించారు.

వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
1/1

వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం

 
Advertisement
 
Advertisement