ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం | Sakshi
Sakshi News home page

ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం

Published Wed, May 8 2024 12:45 AM

ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం

● జెడ్పీ మాజీ చైర్మన్‌ సిడాం గణపతి

పెంచికల్‌పేట్‌: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హ క్కుల జోలికొస్తే ఊరుకునేది లేదని జెడ్పీ మాజీ చైర్మన్‌ సిడాం గణపతి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆదివాసీ, దళిత సంఘాల నా యకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం, గతంలో రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్ర భుత్వాలు ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాయన్నారు. ఆదివా సీల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఐటీడీఏలను నిర్వీర్యం చేయడంతో పాటు ఆదివాసీలు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కున్నాయని ఆరోపించారు. ఆదివాసీలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు వారిని అడవుల నుంచి తరిమికొట్టేలా కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ముకాస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌ పక్షాన నిలబడి ఆదివాసీ సమాజం, రిజర్వేషన్లపైన వ్యాఖ్య లు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రాజ్యాంగాన్ని కాపాడాలని వినతి పత్రం అందజేశారు. లహాన్‌రాజ్‌, కడాల నారా యణ, రాంటెంకి సురేష్‌, పెద్దు సుధాకర్‌, సిడాం తిరుపతి, భక్తు రాంచందర్‌, భుజంగరావు, శంకర్‌, అశోక్‌, రాజన్న, భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement