‘నా ఏకైక​ లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దించడమే’ | Sakshi
Sakshi News home page

‘ఇదే గడ్డ సీఎం కేసీఆర్‌ను మూడు నెలలు నిద్ర పట్టకుండా చేసింది’

Published Sun, Nov 5 2023 3:31 PM

komatireddy Rajagopal Reddy Slams CM KCR - Sakshi

సాక్షి, నల్లగొండ జిల్లా:  తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను గద్దె దించడమే తన ముందున్న లక్ష్యమని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులో ముఖ్యకార్యకర్తలతో రాజగోపాల్‌రెడ్డి సమావేశమయ్యారు. దీనిలో భాగంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘  నేను పార్టీ మారినా కాంగ్రెస్‌లోకే వచ్చా. నా ఏకైక లక్ష్యం కేసిఆర్ నియంత పాలనను గద్దె దించడమే. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి కేసీఆర్‌ ప్రభుత్వం యంత్రాంగం వందమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చింది నిజం కాదా?,

మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడిన తప్పిస్తే మునుగోడుగడ్డ ప్రజలు ఎక్కడ కూడా తలలించుకునేలా చేయలేదు. ఆనాడు ఎంపీగా నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకోరావడానికి  కష్టపడ్డాం.కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబ చేతిలో పోయింది.‌ఆ కుటుంబాన్ని గద్దే దించడానికి పోరాడుతున్నా. రాజ్‌గోపాల్‌రెడ్డికి ప్రజాబలం ఉంది. అధికారంలో ఉన్నా.. లేకపోయినా నా సొంత డబ్బులతో పేద ప్రజలకు సహాయం చేశా.రాజగోపాల్ రెడ్డి అంటే ప్రాణమిచ్చే వాళ్లు లక్ష మంది ఉన్నారు

కాంగ్రెస్ పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చింది. చిరుమర్తి లింగయ్య మోసం చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు గెలుస్తాడా?, ఏ రాజకీయ సంచలనం జరగాలన్నా.. రాజకీయ పెను తుఫాను రావాలన్నా మునుగోడు గడ్డ నుంచే జరుగుతుంది.కేసీఆర్‌ను మూడు నెలలు నిద్ర పట్టకుండా చేసింది మునుగోడు గడ్డ. అమ్ముడుపోయిన వ్యక్తిని అయితే మళ్లీ కాంగ్రెస్ లోకి ఎలా వస్తా.అమ్ముడుపోయానని నాపై ఆరోపణలు చేసిన వ్యక్తులకు ఒకటి చెప్తున్నా

నన్నుకొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. నేను పదవి త్యాగం చేసినా.. పదవిలో ఉన్నా అది ప్రజల కోసమే.. నా పదవి మునుగోడు ప్రజల కోసం వదిలిపెట్టిన. నా చేతిలో ఉన్న రాజీనామా అస్త్రాన్ని వదిలితే ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయి.గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారు.చండూరు ను రెవిన్యూ డివిజన్ చేశారు. చౌటుప్పల్లో వంద పడకల ఆసుపత్రి ఇచ్చారు. కొత్త రోడ్లు వేశారు.గజ్వేల్ లో పోటీ చేస్తాను అని  ఏఐసీసీకి చెప్పా. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోతోంది.ధరణి పోర్టల్ ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది’ అని విమర్శించారు.

Advertisement
Advertisement