ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రయాణం  | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రయాణం 

Published Mon, Mar 4 2024 1:31 AM

Minister Ponnam travel by RTC bus - Sakshi

ఇయర్‌ ఫోన్‌ పెట్టుకున్న డ్రైవర్‌పై ఆగ్రహం  

షాద్‌నగర్‌ (హైదరాబాద్‌)/జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహ బూబ్‌నగర్‌లో నిర్వహించిన గౌడ సంఘం సమావేశానికి వెళ్లేందుకు.. ఆయన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌ నుంచి షాద్‌ నగర్‌ వరకు బస్సులో ప్రయాణించారు. నారాయణపేట డిపో బస్సు ఎక్కిన మంత్రి మహిళా ప్రయా ణికులతో ముచ్చటించారు.

డ్రైవర్‌ ఇయర్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్న విషయాన్ని గమనించిన పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బస్సులోని మహిళా కండక్టర్‌ను ఈ విషయమై అడి గారు. డ్రైవర్‌ చెవిలో ఇయర్‌ ఫోన్లు పెట్టుకొని తమాషా చేస్తున్నాడా?.. అలా మాట్లాడితే సస్పెండ్‌ అవు తాడు తెలుసా?.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు కదా? అన్నారు.

‘కాంగ్రెస్‌ సర్కార్‌ ఆయా.. ఏ సబ్‌ కా సర్కార్‌ హై’.. అంటూ ఓ ముస్లిం ప్రయాణికురాలితో మంత్రి ముచ్చటించారు. పెన్షన్‌ వస్తుందా? అని ప్రశ్నించగా.. రావడం లేదని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్నావా? అని అడిగారు. లేదని ఆమె చెప్పడంతో వెంటనే దరఖాస్తు చేసుకోమని మంత్రి పొన్నం సూచించారు.

కాంగ్రెస్‌ డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాలి 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఉందని.. అదేవిధంగా కేంద్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంఘం ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement