దమ్ముంటే కాంగ్రెస్‌ను టచ్‌ చేయండి | Sakshi
Sakshi News home page

దమ్ముంటే కాంగ్రెస్‌ను టచ్‌ చేయండి

Published Sat, Apr 20 2024 1:25 AM

- - Sakshi

సిరిసిల్లటౌన్‌: అధికారం నుంచి ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌, కేటీఆర్‌లకు అహం పోలేదని, తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటుండ్రని.. దమ్ముంటే కాంగ్రెస్‌ను టచ్‌ చేయండని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటు అభ్యర్థులుగా నిలబెట్టిన వారే ఆ పార్టీ అవినీతి, నియంతృత్వంపై ఛీత్కరించుకుంటూ పార్టీని వీడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అందించే కాంగ్రెస్‌పైనే ప్రజల ఆశీర్వాదం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ లేవీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలు తెలువనోళ్లు రాజకీయం చేస్తే.. ఇట్లానే ఉంటుందని బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఉద్దేశించి విమర్శించారు. ఆ పార్టీల ని యంతృత్వంపై ప్రజలు విసిగిపోయారని, రాహుల్‌ నేతృత్వంలో అందించే ప్రజాపాలనకే రానున్న ఎ న్నికల్లో ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చే శారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటై సిరిసిల్లకు కేటా యించిన మెగా టెక్స్‌టైల్‌ క్లస్టర్‌ను వరంగల్‌కు తరలించి ఇక్కడి కార్మికుల ఉసురు పోసుకున్నారని ధ్వ జమెత్తారు. కరీంనగర్‌ నుంచి పార్టీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు.

రూ.60కోట్ల అప్పు రూ.7లక్షలకు పెరిగింది

అరవై ఏళ్లలో రూ.60కోట్లు అప్పులున్న తెలంగాణను పదేళ్లలో రూ.7లక్షల కోట్ల అప్పుల్లోకి కేసీ ఆర్‌ కుటుంబం నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు గడువక ముందే కూలుతుందని శాపనార్థాలు పెడుతు న్న కేసీఆర్‌ కుటుంబ పార్టీకి ప్రజలు తగిన గుణపా ఠం చెబుతారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ లన్నీ నాలుగు నెలల్లోనే అమలు చేశామని, రాహుల్‌గాంధీ ప్రకటించిన ఈ ఎన్నికల హామీలు సైతం అమలు చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో: ఆది శ్రీనివాస్‌

గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నియంతృత్వ పాలనను ప్రజలు పడగొట్టారని, ఇప్పుడు కేంద్రంలో నియంతృత్వాన్ని కూల్చడానికి సిద్ధమయ్యారన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో కలిసేందుకు సిద్దమవుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ...బండి సంజయ్‌ చదువు రాని మొద్దని, ఆయనను గెలిపించుకున్నందుకే ఏమి అభివృద్ధి చేయలేదన్నారు. కేటీఆర్‌ పనైపోయిందని అమెరికాకు వెళ్లాలో..జైలుకు వెళ్లాలో తేల్చుకునే స మయం ఆసన్నమైందని చురక అంటించారు. చొ ప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అబద్దాలు, మోసాలతో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌లు పాలన సాగించి ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చా ర్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పాల న పోలీస్‌ నిర్బంధంలో సాగిందని ఇప్పుడు ప్రజా పాలనే నడుస్తుందన్నారు. నేరెళ్లలో దళితులపై పోలీస్‌లతో బీఆర్‌ఎస్‌ చేపట్టిన దాష్టీకాన్ని ప్రజలు మరువొద్దన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్ల డబ్బులు నేతన్నలకు ఇవ్వకుండా ఎందుకు బకాయి పెట్టావ్‌ కేటీఆర్‌ అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్‌, సత్యనారాయణ, నాయకులు పెరుమాండ్ల శ్రీనివాస్‌, ప్రణవ్‌, నాగుల సత్యనారాయణ గౌడ్‌, సంగీతం శ్రీనివాస్‌, చీటి ఉమేశ్‌రావు, ఆకునూరి బాలరాజు, చొప్పదండి ప్రకాశ్‌, కనమేని చక్రధర్‌రెడ్డి, వైద్య శివప్రసాద్‌, మ్యాన ప్రసాద్‌, సూర దే వరాజు, పిట్టల భూమేశ్‌, కౌన్సిలర్లు రెడ్యానాయక్‌, కుడిక్యాల రవికుమార్‌, వేముల రవికుమార్‌, గోనె ఎల్లప్ప, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, వెల్ముల స్వరూప, కల్లూరి చందన, మడుపు శ్రీదేవి, గొట్టె రుక్మిణి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఆ పార్టీని వీడుతున్నారు

రాష్ట్ర విభజన హామీలేవీ బీజేపీ నెరవేర్చలేదు

ప్రజలు కాంగ్రెస్‌ వైపే ఉన్నారు

మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement
Advertisement