మూడు సార్లు పర్వతారోహణ | Sakshi
Sakshi News home page

మూడు సార్లు పర్వతారోహణ

Published Thu, Apr 18 2024 2:00 PM

పర్వతారోహణలో రాజేష్‌   - Sakshi

ఎన్‌సీసీ క్యాడెట్‌ కార్పోరల్‌ రాజేష్‌ను కొనియాడిన ఎన్‌సీసీ లెఫ్టినెంట్‌ ఆఫీసర్‌

గజ్వేల్‌రూరల్‌: గజ్వేల్‌లోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్‌ కార్పోరల్‌ రాజేష్‌ వరుసగా 3 సార్లు పర్వతారోహణ చేసినట్లు ఆ కళాశాల ఎన్‌సీసీ లెఫ్టినెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భవాని బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కళాశాలకు చెందిన రాజేష్‌ 2022 అక్టోబర్‌ 1 నుంచి 26 వరకు సుమారు 26 రోజుల పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో బేసిక్‌ మౌంటెనీరింగ్‌ శిబిరాన్ని 2023లో ఏప్రిల్‌ 1 నుంచి 28వ వరకు సుమారు 28రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో అడ్వాన్స్‌ మౌంటెనీరింగ్‌ క్యాంప్‌ను, 2024లో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 11వరకు సుమారు 20 రోజుల ఉత్తరాఖాండ్‌లోని ఉత్తర కాశీలో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ క్యాంప్‌ను పూర్తి చేశారన్నారు. అనంతరం క్యాడెట్‌ కార్పోరల్‌ రాజేష్‌ మాట్లాడుతూ బీఎంసీ క్యాంప్‌లో భాగంగా రాక్‌ లైమింగ్స్‌(పర్వతారోహణ), రివర్‌ క్రాసింగ్‌, మంచు పర్వతాలు అధిరోహించినట్లు తెలిపారు. సుమారు 14 వేల అడుగుల ఎత్తును, ఇందులో భాగంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌తో సుమారు 17 వేల అడుగుల పర్వతారోహణ గావించానన్నారు. అత్యవసర సమయంలో ఆదుకునే సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ శిబిరంలో రాక్‌, హెలికాప్టర్‌ రెస్క్యూ .. నూతన పద్ధతుల ద్వారా శిక్షణ పొందానన్నారు. అయితే 3 నెలల పాటు ఈ క్యాంప్‌ల అవకాశాన్ని కల్పించిన సంగారెడ్డి కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ పీఎస్‌ నందాకు కృతజ్ఞతలు తెలిపారు. రాజేష్‌ను కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అధ్యాపక బృందం అభినందించారు.

Advertisement
Advertisement