బాబర్‌ ఆజమ్‌కు మళ్లీ పాక్‌ జట్టు పగ్గాలు   | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజమ్‌కు మళ్లీ పాక్‌ జట్టు పగ్గాలు  

Published Mon, Apr 1 2024 1:33 AM

Babar Azam retains Pakistan captain  - Sakshi

మరో రెండు నెలల్లో టి20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో... పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వన్డే, టి20 జట్లకు కెప్టెన్ గా మళ్లీ బాబర్‌ ఆజమ్‌ను నియమించారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ జట్టు విఫలమయ్యాక బాబర్‌ కెప్టెన్సీ కోల్పోయాడు.

టి20 జట్టుకు షాహీన్‌ అఫ్రిదిని, టెస్టు జట్టుకు షాన్‌ మసూద్‌ను కెపె్టన్‌లుగా నియమించారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను పాక్‌ జట్టు 1–4తో చేజార్చుకుంది. దాంతో సెలెక్టర్లు కెప్టెన్సీ విషయంలో బాబర్‌ వైపు మొగ్గారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement