RCB Vs PBKS: విరాట్ కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్‌.. వీడియో వైర‌ల్‌ | RCB Vs PBKS: Virat Kohli Becomes Rishabh Pant As He Hits One Handed Six In IPL 2024, Video Goes Viral | Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs PBKS: విరాట్ కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్‌.. వీడియో వైర‌ల్‌

Published Thu, May 9 2024 9:18 PM

Virat Kohli becomes Rishabh Pant as he hits one handed six in IPL 2024

ఐపీఎల్‌-2024లో రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు స్టార్ విరాట్ కోహ్లి త‌న అద్భుత ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా  పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి  ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

విరాట్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్‌.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు.అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి ఓ సంచ‌ల‌న షాట్‌తో మెరిశాడు.

పంజాబ్ యువ పేస‌ర్‌ విధ్వత్ కావేరప్ప బౌలింగ్‌లో కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్ బాదాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 7 వ ఓవ‌ర్ వేసిన కావేరప్ప బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి ఫ్రంట్ ఫుట్‌కు మిడాఫ్ మీద‌గా ఒంటి చేత్తో సిక్స్ బాదాడు. 

విరాట్ షాట్ చూసిన అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 


 

Advertisement
 
Advertisement
 
Advertisement