అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం

Published Wed, Apr 17 2024 12:40 AM

ఎనుములపల్లిలో అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది  - Sakshi

పుట్టపర్తి టౌన్‌: విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరమని డీఎఫ్‌ఓ నాగరాజునాయక్‌ పేర్కొన్నారు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎనుములపల్లి జిల్లా పరిషత్‌, వాసవీ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల విద్యార్థులకు ప్రమాదాల నివారణపై అవగాహనతోపాటు మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏవిధంగా బయటపడాలో తెలిపే కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు వంట పూర్తి చేసిన వెంటనే రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫైర్‌ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డీఎఫ్‌ఓ నాగరాజు నాయక్‌

కొనసాగుతున్న

అగ్నిమాపక వారోత్సవాలు

మాక్‌ డ్రిల్‌తో అవగాహన కల్పిస్తున్న అధికారులు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement