అన్ని రకాల మందులిస్తున్నారు | Sakshi
Sakshi News home page

అన్ని రకాల మందులిస్తున్నారు

Published Fri, Apr 19 2024 1:30 AM

- - Sakshi

గతంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రులు ఎంతో మారాయి. గతంలో సరైన వైద్యం అందేది కాదు. మందులు దొరికేవి కావు. కానీ ఇప్పుడు అలా లేదు. నాకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నాలుగు రోజులుగా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నా. ఇక్కడ వైద్య సేవలు చాలా బాగున్నాయి. మందులు అందిస్తున్నారు. ప్రస్తుతం నా ఆరోగ్యం సైతం కుదుటపడింది. ప్రైవేటు ఆస్పత్రి చికిత్స చేయించుకుని ఉంటే రూ.వేలల్లో ఖర్చయ్యేది. ప్రభుత్వాస్పత్రిలోనే నాకు ఉచితంగా మెరుగైన వైద్యం అందింది.

– నారాయణస్వామి, వీవర్స్‌కాలనీ, హిందూపురం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement