11 నగరాలకు కోవాగ్జిన్ | Sakshi
Sakshi News home page

11 నగరాలకు కోవాగ్జిన్

Published Thu, Jan 14 2021 2:46 AM

Bharat Biotech Coronavirus Covaxin To Distribute Eleven Cities In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌: కోవిడ్‌–19 టీకా కోవాగ్జిన్ ను దేశంలోని 11 నగరాలకు చేర్చామని, ప్రభుత్వానికి దాదాపు 16.5 లక్షల డోసుల వ్యాక్సిన్లను విరాళంగా ఇచ్చినట్లు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ (బీఈ) వెల్లడించింది. ఈమేరకు ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి నిర్వహించ నున్న టీకా కార్యక్రమం కోసం భారత ప్రభు త్వం బీఈ నుంచి 55 లక్షల డోసుల కోవాగ్జిన్‌ను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో తొలి విడతగా శంషాబాద్‌ అంతర్జాతీ య విమానాశ్రయం నుంచి గన్నవరం, గువా హటి, పట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణే, భువనేశ్వర్, జైపూర్, చెన్నై, లక్నో నగరాలకు బుధవారం టీకాలను సరఫరా చేసినట్లు బీఈ వివరించింది. నిర్వీర్యం చేసిన సార్స్‌–కోవ్‌2 వైరస్‌తో తయారు చేసిన కోవాగ్జిన్  దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో తయారైన తొలి టీకా కావడం గమనార్హం.

Advertisement
Advertisement