వసూల్‌ రాజాలు పీక్కుతిన్నారు..! | Sakshi
Sakshi News home page

వసూల్‌ రాజాలు పీక్కుతిన్నారు..!

Published Thu, May 9 2024 4:00 AM

-

గంట్యాడ:

గంట్యాడ మండలంలోని ఓ గ్రామంలో ఇల్లు మంజూరుకు ఓ మహిళా లబ్ధిదారును జన్మభూమి కమిటీ మెంబర్‌ రూ.20 వేలు ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇస్తేనే ఇల్లు మంజూరవుతుంది. లేదంటే లేదని తెగేిసి చెప్పేశాడు. దీంతో చేసేది లేక ఆ లబ్ధిదారు అడిగినంత ఇచ్చేసింది.

● బొండపల్లి మండలంలో అంగన్‌వాడీ పోస్టు నిమత్తం ఓ మహిళ దగ్గర రూ.3 లక్షలు డిమాండ్‌ చేశారు. డబ్బులిస్తే పోస్టు మంజూరు చేస్తామని చెప్పడంతో చేసేది లేక అడిగినంత ఆమె కూడా చెల్లించింది.

● గంట్యాడ మండలంలో ట్రాక్టర్‌ కోసం ఓ రైతును జన్మ భూమి కమిటీ మెంబర్‌ రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. రూ.30 వేలు ఇస్తేనే ట్రాక్టర్‌ మంజూరు చేయిస్తానని చెప్పడంతో ఆ రైతు చేసేది లేక చివరికి జన్మభూమి కమిటీ సభ్యుడు అడిగినంత ముట్ట జెప్పాడు.

● టీడీపీ పాలనలో 2014–2019 మధ్య కాలంలో జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతలు చెప్పిందే శాసనం. అన్న విధంగా పాలన జరి గింది. ప్రతి దాంట్లోను వారు అధికార దర్పాన్ని ప్రదర్శించారు. వారి ఆజ్ఞ లేనిది ఏపనీ జరిగేది కాదు, ఏ ఫైల్‌ ముందుకు కదిలేది కాదు. అధికారులు సైతం జన్మభూమి కమిటీ ఆదేశాలకు జీ హుజూర్‌ అనేవారు. జన్మభూమి కమిటీలకు అడిగినంత ఇవ్వలేక ప్రజలు తీవ్ర ఇబ్బందిపడేవారు. ఒక విధంగా చెప్పాలంటే జన్మభూమి కమిటీలు జనాన్ని పీక్కుతిన్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

పంట నష్ట పరిహారంలోనూ దోపిడీ

అతివృష్టి, అనావృష్టి కారణంగా జరిగే పంట నష్టానికి ఇచ్చే పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీలోను టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారు. పంటనష్టం జరగకపోయినా, భూమి లేని వారికి కూడ పంటనష్టం రాయించుకుని అధిక మొత్తంలో పరిహారం కాజేశారు. పంటనష్ట పరిహారంలో ఒక్కో టీడీపీ నేత రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు వసూలు చేశారు.

● టీడీపీ జన్మభూమి కమిటీలు చేసిన ఈ ఆగడాలు, అక్రమాలు, వసూళ్లను భరించలేకపోయిన రాష్ట్రప్రజలు ఆ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పారు. రాష్ట్ర చరిత్రను తిరగరాశారు. కనీవినీ ఎరుగని విధంగా గడిచిన సార్వత్రిక ఎన్నిక(2019)ల్లో వైఎస్సార్‌సీపీకి 151 ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టి తెలుగుదేశం పార్టీని తుంగలో తొక్కి జన్మభూమి కమిటీలపై తమకున్న ఆక్రోశాన్ని తీర్చుకున్నారు.

Advertisement
Advertisement