ఈ స్మార్ట్ఫోన్ను మడవొచ్చు..! | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్ఫోన్ను మడవొచ్చు..!

Published Fri, Jun 3 2016 12:46 AM

ఈ స్మార్ట్ఫోన్ను మడవొచ్చు..!

అభివృద్ధి చేస్తున్న శామ్‌సంగ్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మడవగలిగే స్మార్ట్‌ఫోన్.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కొద్ది రోజుల్లో ఇది సాకారం కానుంది. టెక్నాలజీ దిగ్గజం శామ్‌సంగ్ దీనికోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అన్నీ అనుకూలిస్తే 2017లో ఈ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తేవడానికి రెడీ అవుతోంది. గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఇచ్చిన విజయంతో కంపెనీ కొత్త కాన్సెప్ట్‌తో రంగంలోకి దిగింది. ఓలెడ్ డిస్‌ప్లే సాంకేతిక పరిజ్ఞానంలో ఇటీవల వచ్చిన మార్పులు కంపెనీకి మార్గాన్ని సుగమం చేశాయి.

సిల్వర్ నానోవైర్ ఆధారిత ఫ్లెక్సిబుల్ టచ్ డిస్‌ప్లే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందుకు వాడుతున్నట్టు సమాచారం. ఫ్యాబ్లెట్స్, ట్యాబ్లెట్స్‌ను మడిచి జేబులో పెట్టుకునేలా రూపొందించేందుకు కంపెనీలకు ఈ టెక్నాలజీ దోహదం చేస్తుంది. ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ పేటెంటు కోసం యూఎస్ పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో (యూఎస్‌పీటీవో) శామ్‌సంగ్ దరఖాస్తు చేసింది. మే నెలాఖరులో పేటెంట్ అప్లికేషన్‌ను యూఎస్‌పీటీవో పబ్లిష్ చేసింది.

 ఇక ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు గెలాక్సీ ఎక్స్ అని తెలుస్తోంది. పనితీరు ఇతర స్మార్ట్‌ఫోన్ల మాదిరిగానే ఉం టుంది. ఆరు అంగుళాలు ఆపైన స్క్రీన్ ఉన్న ఫ్యాబ్లెట్, ట్యాబ్లెట్ సైతం జేబులో ఇట్టే ఇమిడిపోతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement