అనిల్‌.. 21 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించండి | Sakshi
Sakshi News home page

అనిల్‌.. 21 రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించండి

Published Sat, May 23 2020 8:55 AM

UK Court Orders Anil Ambani To Pay 717 Million Dollars To Chinese Banks - Sakshi

లండన్‌ : రుణ ఒప్పందంలో భాగంగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న 717 మిలియన్‌ డారల్లను( భారత కరెన్సీలో దాదాపు రూ. 5446 కోట్లు) 21 రోజుల్లోగా చెల్లించాలంటూ రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి శుక్రవారం యూకే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2012 లో రిలయన్స్ కామ్ మూడు చైనీస్ బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి అనిల్ అంబానీ తన వ్యక్తిగత హామీని సమర్పించారు.  కాగా సంస్థ ఇప్పుడు దివాలా తీర్పులో ఉండడంతో వడ్డీతో తిరిగి పొందాలని బ్యాంకులు దావా వేసిన రుణంపై డిఫాల్ట్ అవడంతో సదరు బ్యాంకులు కోర్టును ఆశ్రయించాయి. కాగా రిలయన్స్‌కు రుణం ఇచ్చిన మూడు చైనా బ్యాంకుల్లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ (ముంబై బ్రాంచ్), చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు ఉన్నాయి.(అమెజాన్‌లో 50,000 ఉద్యోగాలు)

లాక్‌డౌన్‌  ఆంక్షలు అమల్లో ఉండడంతో లండన్‌ హైకోర్టులోని వాణిజ్య విభాగంలో జస్టిస్ నిగెల్ రిమోట్ హియరింగ్ ద్వారా శుక్రవారం విచారణ చేపట్టారు. రుణం తీసుకున్నప్పుడు అనిల్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ తీర్పునిచ్చారు. నిగెల్‌ చదివిన తీర్పులో హామీ యొక్క 3.2 నిబంధన ప్రకారం, రిలయన్స్‌ కామ్‌ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో హామీ ఇచ్చిన వ్యక్తే దానిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యక్షంగా ఆ సంస్థ ప్రతినిధి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది దివాల చర్య చట్టం కింద వర్తిస్తుందంటూ పేర్కొన్నారు. 21 రోజుల్లోగా మూడు చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని మొత్తం చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకావం ఉందంటూ తీర్పునిచ్చారు. కాగా ఇంతకుముందు జరిగిన విచారణలో అంబానీ వాదనను కోర్టు తోసిపుచ్చింది.ప్రస్తుతం అనిల్‌ నికర విలువ సున్నాగా ఉండడంతో  అతని కుటుంబం నుంచి ఎటువంటి మద్దతు పొందే అంశంపై కోర్టు నిరాకరించింది.
(జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక)

Advertisement
 
Advertisement
 
Advertisement