-
వాజిద్ తల్లికి కరోనా
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్‌ఖాన్ (42) కరోనా వైరస్ సోకిన కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు కోలుకోకముందే వాజిద్ తల్లి రజీనా ఖాన్ కరోనా బారిన పడటం వారిని ఆందోళనకు గురి చేసింది..ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో రజీనా చికిత్స తీసుకుంటున్నారు. ‘‘రజీనాగారికి కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. కాస్త కోలుకున్న తర్వాత ఆమె హోం క్వారంటైన్లో ఉంటారు’’ అని వాజిద్ కుటుంబ సన్నిహితులు పేర్కొన్నారు. నిద్రపట్టడం లేదు! ముంబైకి చెందిన ప్రముఖ టీవీ నటి మొహేనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురికి కరోనా సోకింది. ఈ విషయంపై మొహేనా స్పందిస్తూ – ‘‘నిద్రపట్టడం లేదు. ఇవి మా అందరికీ చాలా క్లిష్టమైన రోజులు. ముఖ్యంగా నా కొడుకు, మా అత్తమామలకు మరింత ఇబ్బంది. మేం అందరం కోలుకోవాలని కోరుకుంటున్నవారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు మొహేన. 2013లో ‘ఏబీసీడీ: ఎనీబడీ కేన్ డ్యాన్స్’ చిత్రంలో నటించిన మొహేన బుల్లితెరపై కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. -
వాజీద్ ఖాన్ తల్లికి కరోనా పాజిటివ్
బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు , గాయకుడు వాజీద్ ఖాన్ (42) అనారోగ్య సమస్యలతో ముంబైలోని చెంటూర్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడతున్న ఆయనకు ఇటీవలె కరోనా సోకింది. వాజీద్ తల్లి రజినాకు కూడా కోవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. అయితే వాజీద్ కంటే ముందే ఆమెకు వైరస్ సోకిందని పేర్కొన్న వైద్యులు..కొడుకు అనారోగ్యం కారణంగా అతన్ని చూసుకోవడానికి ఆసుపత్రిలోనే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమెకు కరోనా నిర్ధారణ కాగా, తల్లి నుంచి వాజీద్‌కు కూడా వైరస్ సోకిందేమో అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. (బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ కన్నుమూత ) ఇక వాజీద్ ఖాన్ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, సన్నిహితులతో సహా 20 మందిని మాత్రమే అనుమతించారు. వాజీద్ మృతి పట్ల అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన ప్యార్ కియాతో డర్నా క్యా చిత్రంతో ఇండస్ర్టీకి పరిచయం అయ్యారు. అప్పటినుంచి ఇద్దరూ కలిసి పనిచేస్తూ వచ్చారు. లాక్డౌన్ సమయంలోనూ హీరో సల్మాన్ ఖాన్ భాయ్ భాయ్ పాటకు సంగీతం అందించారు. నీ మీద ఉన్న ప్రేమ, గౌరవం ఎప్పటికీ తగ్గవు. ఎప్పటికీ గుర్తిండిపోతావ్ నీ ప్రతిభను మిస్సవుతాను అంటూ సల్మాన్ ట్వీట్ చేశారు. (తెలంగాణ ప్రజలకు చిరు విషెస్ ) -
సల్మాన్ సినిమాతో ఎంట్రీ.. బాలీవుడ్‌ను ఏలేశారు
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫేమస్ సంగీత ద్వయం సాజిద్-వాజిద్లలో ఒకరైన వాజిద్ ఖాన్ ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాజిద్ ప్రాణాలు విడిచారు. సల్మాన్ ఖాన్ హీరోగా 1998లో వచ్చిన ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ చిత్రంతో సాజిద్-వాజిద్ ద్వయం బాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. దాదాపు 20 ఏళ్ల సినీ ప్రయాణంలో వీరిద్దరు ఎన్నో సూపర్‌హిట్ పాటలకు సంగీతం అందించారు. వాటిలో బాగా ప్రసిద్ధి చెందిన కొన్ని పాటల వివరాలు... ప్యార్ కియాతో డర్నా క్యా(1998) సల్మాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ద్వారా సాజిద్-వాజిద్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అర్భాజ్ ఖాన్‌పై తెరకెక్కించిన తేరి జవానీ సాంగ్‌ను సాజిద్-వాజిద్ ద్వయం కంపోజ్ చేశారు. ఈ సినిమా నుంచే సల్మాన్ ఖాన్‌కు, వాజిద్‌కు మధ్య స్నేహం కుదిరింది. హలో బ్రదర్(1999) మరుసటి ఏడాదే సాజిద్-వాజిద్, సల్మాన్ హీరోగా నటించిన హలో బ్రదర్ చిత్రానికి.. హిమేష్ రేషమ్మియాతో పాటు సంగీతం అందించారు. ఈ చిత్రంలో ‘ఏరియా కా హీరో’, ‘హతా సావన్ కి ఘాటా’, ‘చుప్కే సే కోయి’తో పాటు హలో బ్రదర్ టైటిల్ ట్రాక్‌తో కలిపి మొత్తం నాలుగు పాటలకు సాజిద్-వాజిద్ సంగీతం అందించారు. తుమ్కో నా భూల్ పాయెంగే (2002) 1999 నుంచి 2002 కాలంలో కొన్ని హిట్ ట్రాక్‌ల తర్వాత సాజిద్-వాజిద్ ద్వయం మరోసారి సల్మాన్ చిత్రానికి సంగీతం అందించారు. సుస్మితా సేన్, దియా మీర్జా హీరోయిన్లుగా, సల్మాన్ హీరోగా నటించిన తుమ్కో నా భూల్ పాయెంగే చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ముబారక్ ఈద్ ముబారక్’ పాట బాగా ప్రాచుర్యం పొందింది. తేరే నామ్ (2003) సల్మాన్ ఖాన్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘తేరే నామ్’ ఒకటి. ఈ సినిమాకు కూడా సాజిద్-వాజిద్ ద్వయం, హిమేష్ రేషమ్మియాతో కలిసి సంగీతం సమకూర్చారు. చిత్రంలోని ‘సాథ్ జో మేరా చోడా’ పాట బాగా ప్రసిద్ధి చెందింది. ముజ్సే షాదీ కరోగి, గర్వ్ (2004) 2004 సంత్సరం భాయిజాన్‌తో పాటు సాజిద్-వాజిద్లకు కూడా బాగా కలసి వచ్చింది. ఆ ఏడాది సల్మాన్ నటించిన ముజ్సే షాదీ కరోగి, గర్వ్ చిత్రాలు రెండు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లోని మొత్తం 12 పాటలకు సాజిద్-వాజిద్ ద్వయం సంగీతం అందించారు. ‘గర్వ్’ చిత్రంలోని ‘హమ్ తుమ్కో నిగహోన్ మెయిన్’, ‘దమ్ మస్త్ మస్త్’, ‘సోనియే తో సోనీ’, ‘ఫరియాద్ క్యా కరే హామ్’, ‘తేరే హై దివానా దిల్’ పాటలకు సంగీతం అందించారు. అలానే ‘ముజ్సే షాదీ కరోగి’ చిత్రంలో ‘రబ్ కరే, ‘ముజ్సే షాదీ కరోగి’, ‘ఆజా సోనియే’, దాని రీమిక్స్ వెర్షన్లు, ‘లాహూ బాంకే అన్సూన్’, ‘కార్ డూన్ కమల్’, ‘లాల్ దుపట్టా’తో కలిపి మొత్తం ఏడు పాటలకు సంగీతం సమకూర్చారు. ది కిల్లర్ (2006) ఇమ్రాన్ హష్మి నటించిన ‘ది కిల్లర్’.. సాజిద్-వాజిద్ సోలోగా సంగీతం అందించిన చిత్రం. ఈ సినిమా సంగీతం, పాటలు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇన్ని రోజులు సల్మాన్ ఖాన్ చిత్రాలకు మాత్రమే పని చేస్తారనే విమర్శను ఈ చిత్రం తుడిచేయడమే కాక ఇండస్ట్రీలో వారి స్థానాన్ని సుస్థిరం చేసింది. పార్టనర్(2007) ఈ చిత్రంలోని పాటలు ఇప్పుడు విన్నా.. మనకు తెలియకుండానే కాళ్లు కదుపుతాం. ఈ సినిమాతో సాజిద్-వాజిద్ కీర్తి రెట్టింపు అయ్యింది. ఇదే ఏడాది సాజిద్-వాజిద్ ద్వయం, అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, కత్రినా కైఫ్ నటించిన ‘వెల్కమ్’ చిత్రంలోని ఓ పాటకు సంగీతం అందించారు. వాంటెడ్(2009) సల్మాన్ ఖాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి సాజిద్-వాజిద్లే సంగీతం సమకూర్చారు. మరోసారి ఈ ముగ్గురి మ్యాజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దబాంగ్(2010) దబాంగ్, దాని తర్వాత వచ్చిన ఈ చిత్ర సీక్వెల్స్ అన్నింటికి సాజిద్-వాజిద్ ద్వయమే సంగీతం సమకూర్చారు. దబాంగ్ చిత్రంలోని ‘మున్ని బద్నామ్ హూయి’ పాట దేశ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హౌస్‌ఫుల్ 2, రౌడీ రాథోడ్ (2012) 2012 ఏడాది అక్షయ్ కుమార్‌తో పాటు సాజిద్-వాజిద్లకు కూడా బాగా కలసి వచ్చింది. ఒక్క ఏడాదిలో అక్షయ్ రెండు బాక్సాఫీస్ హిట్ చిత్రాలను విడుడదల చేస్తే ఈ రెండు చిత్రాలకు సాజిద్-వాజిద్లే సంగీతం సమకూర్చారు. దబాంగ్ 2, ఏక్ థా టైగర్(2012) దబాంగ్ 2 చిత్రంతో సాజిద్-వాజిద్లిద్దరు గేయ రచయితలుగా మారారు. ‘ఫెవికల్ సే’ పాటను ఇద్దరు రచించగా.. వాజిద్ మరో అడుగు ముందుకు వేసి.. గాయకుడి అవతారం ఎత్తారు. చిత్రంలో ‘పాండే జీ సీతి’, ‘ఫెవికోలస్ సే’ పాటలను వాజిద్ పాడారు. అలానే సల్మాన్ ‘ఏక్ థా టైగర్’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ మాషల్లా పాటకు వీరు సంగీతం సమకూర్చారు. మే తెరా హీరో, హీరోపంటి (2014) 2014 వచ్చే సరికి సాజిద్-వాజిద్‌లు బాలీవుడ్లో ప్రసిద్ధి చెందిన ప్రతి అల్బామ్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ క్రమంలో వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన మే తేరా హీరో, టైగర్ ష్రాఫ్ హీరోపంటి చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలానే ఇదే ఏడాది విడుదైలన సల్మాన్ ‘జయహో’ చిత్రానికి వీరు మ్యూజిక్ అందించారు. అయితే సినిమా విజయం సాధించకపోయినప్పటికి.. పాటలు మాత్రం బాగా ప్రసిద్ది చెందాయి. జుడ్వా (2017) సల్మాన్ ఖాన్ ద్విపాత్రిభినయంలో కరిష్మా కపూర్, రంభ జంటగా వచ్చిన ‘జుడ్వా’ చిత్రానికి రిమేక్‌గా ‘జుడ్వా 2’ తెరకెక్కింది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి అను మాలిక్‌తో పాటు సాజిద్-వాజిద్‌లు కూడా సంగీతాన్ని అందించారు. దబాంగ్ 3(2019) ఏడు సంవత్సరాల తర్వాత సల్మాన్ చుల్బుల్ పాండేగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనతో పాటు సంగీత ద్వయం సాజిద్-వాజిద్‌లను కూడా తీసుకొచ్చాడు. ఈ చిత్రానికి వీరిద్దరే సంగీతం సమకూర్చారు. ఈ చ్రితంలో ‘హుద్ హుద్ దబాంగ్’, ‘మున్నీ బద్నామ్’కు కొత్త వర్షన్ ‘మున్నా బద్నాం’ పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇవేకాక లాక్‌డౌన్‌లోనూ హీరో సల్మాన్ ఖాన్ "భాయ్ భాయ్" పాటకు వాజీద్ సంగీతం అందించారు. -
సంగీత దర్శకుడు వాజీద్‌ఖాన్ మృతి
-
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
ముంబై: బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వాజీద్ ఖాన్(42) ఆదివారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని చెంటూర్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు కిడ్నీ సమస్యలు ఉండటంతో కొన్ని నెలల క్రితం కిడ్నీ మార్పిడి చేసుకున్నారు. ఇదిలా వుంటే కొద్ది రోజుల క్రితమే ఆయన కరోనా బారిన పడ్డారు. కాగా సాజిద్- వాజిద్ పేరిట సంగీతాన్ని సమకూరుస్తూ వాజీద్ ఖాన్ పాపులర్ అయ్యారు. బాలీవుడ్‌కు ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. లాక్‌డౌన్‌లోనూ హీరో సల్మాన్ ఖాన్ "భాయ్ భాయ్" పాటకు సంగీతం అందించారు. (తాప్సీ ఇంట్లో విషాదం..) ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 'వాజీద్ ఖాన్ నవ్వు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంద'ని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. 'అతను మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు' అని సింగర్ హర్షదీప్.. వాజీద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సింగర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన బబుల్ సుప్రియో అతని మరణ వార్త విని షాక్‌కు లోనయ్యానన్నారు. మంచి మిత్రుడిని, ప్రతిభావంతుడిని కోల్పోయానంటూ విచారం వ్యక్తం చేశారు.(ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
జయరాం.. రాం!
ఆ ఒక్కటీ అడక్కు చూసి నవ్వుకుందాం: అడివి శేష్
Lok sabha elections 2024: మూడో దశలో మహా ఫైట్
తప్పక చదవండి
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
Advertisement