
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్‌ఖాన్ (42) కరోనా వైరస్ సోకిన కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు కోలుకోకముందే వాజిద్ తల్లి రజీనా ఖాన్ కరోనా బారిన పడటం వారిని ఆందోళనకు గురి చేసింది..ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో రజీనా చికిత్స తీసుకుంటున్నారు. ‘‘రజీనాగారికి కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. కాస్త కోలుకున్న తర్వాత ఆమె హోం క్వారంటైన్‌లో ఉంటారు’’ అని వాజిద్ కుటుంబ సన్నిహితులు పేర్కొన్నారు.
నిద్రపట్టడం లేదు! ముంబైకి చెందిన ప్రముఖ టీవీ నటి మొహేనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురికి కరోనా సోకింది. ఈ విషయంపై మొహేనా స్పందిస్తూ – ‘‘నిద్రపట్టడం లేదు. ఇవి మా అందరికీ చాలా క్లిష్టమైన రోజులు. ముఖ్యంగా నా కొడుకు, మా అత్తమామలకు మరింత ఇబ్బంది. మేం అందరం కోలుకోవాలని కోరుకుంటున్నవారందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు మొహేన. 2013లో ‘ఏబీసీడీ: ఎనీబడీ కేన్ డ్యాన్స్’ చిత్రంలో నటించిన మొహేన బుల్లితెరపై కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment