అభిప్రాయం
ఎన్నికల ప్రచారంలో జగన్‌మోహన్ రెడ్డికి లభి స్తున్న అపూర్వ ప్రజా స్పందనను చూస్తుంటే... తెలుగు రాష్ట్రాలను ఇంతవరకూ పాలించిన ముఖ్యమంత్రులెవరికీ ఇంతటి ప్రజాదరణ లేదని పిస్తోంది. దీనికంతటికీ ఆయన ప్రజల కోసం చేసిన పనులే కారణం అన్నది స్పష్టం.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సంక్షేమ పథకా లను ప్రవేశపెట్టి వాటిని అవసరమున్న ప్రజలకు అందజేయడం మంచి పాలకుల లక్షణం. మధ్య దళారుల వ్యవస్థ లేకుండా వారికి అందజేయవలసిన డబ్బును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసి అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసిన ఘనత జగన్‌దే.
ప్రజాస్వామ్యానికి సరైన నిర్వచనమైన ‘ప్రజల యొక్క, ప్రజల కొరకు. ప్రజల చేత’ పాలన సాగించడం జగన్ సాధించిన అద్భుత విజయం. గ్రామ వలంటీర్ వ్యవ స్థను ప్రవేశపెట్టి ప్రజల ముంగిట్లోకి పాలనను, ప్రభుత్వ పథకాలను చేరేట్టు చేయడం మరో గొప్ప విజయం.
కార్పొరేట్ శక్తులు, రాజకీయ అహంభావ నిరంకుశ శక్తులను మినహాయిస్తే... జగన్ వల్ల లాభపడని ఒక్క కుటుంబమూ ఆంధ్రప్రదేశ్‌లో కనబడదు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిన కుటుంబానికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా... పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్లమాధ్యమ విద్యను అందిస్తున్న ఘనత జగన్‌దే. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కార్పొరేట్ విద్యను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే అందించడం ఏపీలోనే కనిపిస్తున్నది.
ఇది ప్రభుత్వ విద్యా విధానానికీ గౌరవం కల్పించడంతోపాటూ బహుజన వర్గాలకు పట్టాభిషేకం చేయడం లాంటిదే. సామాజిక న్యాయం తద్వారా సామాజిక మార్పుకు దోహదం చేసే అందరికీ ఉచిత కార్పొరేట్ విద్య, ఉచితౖ వెద్యం, పాలనా రంగంలో బహుజన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడం లాంటివన్నీ ఈ ఐదేళ్ళ పాలనలో సాగాయన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఎన్నికల ప్రచారానికి జగన్ ఎక్కడికి వెళ్ళినా అసంఖ్యాక జనం! మండుటెండ ల్లోనూ రోడ్లపై నిలబడి ఎదురుచూస్తూ నీరాజనాలు!!
బసవేశ్వరుడు, నారాయణగురు, రవిదాస్ చమార్, పెరియార్ రామ స్వామి, ఫూలే, అంబేడ్కర్ లాంటి తత్త్వవేత్తలను చూశాము. జాషువా లాంటి సాంఘిక విప్లవ కవులను చూశాము. సాహు మహరాజ్ లాంటి సామాజిక విప్లవ పాలకులను చూశాము. నెహ్రూ లాంటి సెక్యులర్, సెమీ సోషలిస్ట్ నాయకులను చూశాము. జగన్ ఐదేళ్ల పాలన వీళ్లందరి సమాహారంగా కనిపిస్తోంది. అందుకే ఏపీలో సామాజిక మార్పుల దిశగా బలమైన పునాదులు పడి గుణాత్మక మార్పులు వస్తున్నాయి.
అయితే టీడీపీ–జనసేన–బీజేపీల కూటమికి జగన్ పాలన నచ్చడంలేదు. ఆయనపై అసత్య ప్రచారంతో దాడి చేస్తోంది. తమ అసంబద్ధ మేనిఫెస్టోతో ప్రజ లను మభ్యపెడుతోంది. జగన్ మాత్రం ఐదేళ్ళలో తాను చేసిన పనులను నమ్ముకొనే ప్రజాస్వామిక పద్ధతిలో ప్రచార రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు జగన్ మరోసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నమ్మి జగనన్ననే అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.
జగన్‌కు లభిస్తున్న జనాదరణను సహించలేక ఆయన్ని భౌతికంగా తొలగించాలనుకునే రాజకీయ దివాలాకోరుతనాన్ని ప్రతిపక్షాలు ప్రదర్శించడం శోచనీయం. ఎవరెన్ని దాడులు చేసినా, రాజనీతిని రాజభీతిగా మార్చినా జగన్ విజయాన్ని ఆపలేవు. ఎందుకంటే జగన్ ‘సెక్యులరిజం, సోషలిజం’ భావాలను హృదయానికి హత్తుకొని అన్ని వర్గాల, అన్ని వర్ణాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత కోసం ప్రజాస్వామిక పాలనను అందిస్తున్న సాంఘిక విప్లవ నాయకుడు!!
డా‘‘ కాలువ మల్లయ్య
వ్యాసకర్త ప్రముఖ కథారచయిత ‘ 91829 18567
Comments
Please login to add a commentAdd a comment