ప్రమాదంలో ముస్లిం సమాజం | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ముస్లిం సమాజం

Published Wed, May 8 2024 5:31 AM

Resolution of the Round Table Conference of Muslim Intellectuals

మతపరమైన రిజర్వేషన్ల ముసుగులో ముస్లింలను దెబ్బతీసేందుకు కూటమి కుతంత్రం 

ముస్లిం హక్కులు కాపాడుతానన్నాకే జగన్‌పై అన్ని పార్టీల మూకుమ్మడి దాడి    

సెక్యులర్‌ లీడర్‌ సీఎం జగన్‌ను గెలిపించుకోవడం మన బాధ్యత  

ముస్లిం మేధావుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానం  

సాక్షి, అమరావతి: కూటమి కుతంత్రంతో ముస్లిం సమాజం పెను ప్రమాదంలో పడిందని, ఇలాంటి పరి­స్థితుల్లో ముస్లిం హక్కులు కాపాడతానని భరో­సా ఇచ్చిన సెక్యులర్‌ లీడర్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవడం మన ధర్మమని ముస్లిం మేధావుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది. ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ), ముస్లిం ఆలోచనపరుల వేదిక(ఎంటీఎఫ్‌)ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం రౌంట్‌ టేబుల్‌ సమావేశం జేఏసీ రాష్ట్ర కన్వినర్‌ షేక్‌ మునీర్‌ అహ్మద్‌ అధ్యక్షతన నిర్వహించారు. 

‘ముస్లిం సమస్యలు–ప్రజాస్వామ్య పరిరక్షణ మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని ముస్లిం ఉలేమాలు, జమాత్‌ల ప్రతినిధులు, డాక్టర్లు, లాయ­ర్లు, పలు రంగాలకు చెందిన నిపుణులు, ఆలోచనపరులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. పలువురు మాట్లాడుతూ.. విద్యాపరంగాను, సామాజికంగాను అత్యంత వెనుకబాటుకు గురైన ముస్లింలకు వైఎస్సార్‌ నాలుగు శాతం రిజర్వేషన్లు కలి్పంచారని తెలిపారు. 

అవి మతపరమైన రిజర్వేషన్లుగా దు్రష్పచారం చేసి ఎన్డీఏ కూటమి ముస్లిం సమాజాన్ని దారుణంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, వక్ఫ్‌ బోర్డును తీసివేస్తామనే ప్రకటనలతో మైనా­రీ్టల పట్ల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ము­స్లింలను అవమానిస్తున్న ఎన్డీఏ కూటమితో గతం­లోనూ, ఇప్పుడు జతకట్టిన చంద్రబాబు ముస్లిం సమస్యలపై పోరాడుతానంటే ఎలా నమ్మాలని ప్రశి్నంచారు. కూటమిలో చేరిన టీడీపీ, జనసేన రాను­న్న కాలంలో బీజేపీలో విలీనం కావడం ఖాయమన్నారు.

ప్రసంగించిన వారిలో తబ్లిక్‌ జమాత్‌ అధ్య­క్షుడు అక్బర్‌ బాషా, జమాత్‌ అహ్లెహదీస్‌ అధ్యక్షుడు నసీర్‌ ఉమరి, కార్యదర్శి అతీఖ్‌ రెహమాన్, జమాత్‌ అయిమ్మ ఉలమ ప్రతినిధులు ముఫ్తి యూసుఫ్, ముఫ్తీ హబీబ్, అహ్లె సున్న­త్‌ వల్‌ జమాత్‌ ప్రతినిధి ఖలీల్, ముస్లిం అడ్వకేట్‌ అసో­సియేషన్‌ ప్రతినిధి అబ్దుల్‌ మతీన్, ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రతినిధి హబీబ్‌ రెహమాన్, అంజుమాన్‌ ఇస్లామియా ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ రెహమాన్, మోహిద్దీన్, షఫీ అహ్మద్, ముస్లిం ఆలోచనపరుల వేదిక రాష్ట్ర కనీ్వనర్‌ యజ్దూనీఖాన్‌ తదితరులున్నారు.  

వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిద్దాం 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకోసం ముస్లింలంతా ఏకతాటిపై పనిచేయాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్టు ముస్లిం జేఏసీ రాష్ట్ర కనీ్వనర్‌ షేక్‌ మునీర్‌ అహ్మద్‌ మీడియాకు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు కాపాడతానని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించాకే బీజేపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ పారీ్టలు మూకుమ్మడిగా ఆయనపై దాడిని పెంచాయన్నారు. ధైర్యంగా ముస్లింలకు అండగా నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌ను మరోసారి గెలిపించుకోవడం మన బాధ్యతగా తెలిపారు.   
కాంగ్రెస్‌కు ఓటేసినా బీజేపీ కూటమికే లాభం 
రాష్ట్రంలో ముస్లిం సమాజానికి చెందిన ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్‌ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయంలో ముస్లింలు చాలా అప్రమత్తంగా ఉండాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ– విజయవాడ) మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ రెహమాన్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ముస్లిం ఓట్లు చీలిపోయి పరోక్షంగా బీజేపీ, దాని కూటమి పారీ్టలకే మేలు చేసినట్టవుతుందన్నారు. ప్రతి ముస్లిం ఓటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే పడేలా ఎవరికి వారే బాధ్యత వహించాలని సూచించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement