Weekly Horoscope: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు

Published Sun, Apr 7 2024 6:39 AM

Weekly Horoscope Telugu 07-04-2024 To 13-04-2024 - Sakshi

మేషం: కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనసౌఖ్యం. ఇంటాబయటా మీకు ఎదురుండదు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విశేష గౌరవం లభిస్తుంది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: అమితోత్సాహంతో పురోగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సేవలు గుర్తింపు పొందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.

మిథునం: మీ అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పవచ్చు. ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఎదురవుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: చేపట్టిన వ్యవహారాలు కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీపై మరింత ఆదరణ చూపుతారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబ సమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది.

తుల: నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో  అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలుకు చర్యలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. గులాబీ, నీలం రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి చాలావరకూ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. మీ ప్రతిపాదనలు అందరూ ప్రశంసిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు తీరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. ఆపదలోని వారికి సైతం చేయూతనందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువిరో«ధాలు. ఖర్చులు పెరుగుతాయి. గులాబీ, తెలుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.

మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చరంగులు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

కుంభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులతో విరోధాలు. అనారోగ్య సూచనలు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. విద్యార్థులకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గామాతకు అర్చన చేయండి.

మీనం: ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Advertisement
Advertisement