బ్లాక్‌రాక్‌ బ్యాక్‌ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం | Sakshi
Sakshi News home page

బ్లాక్‌రాక్‌ బ్యాక్‌ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం

Published Thu, Jul 27 2023 11:37 AM

BlackRock returns to India joining forces with Indian tycoon Mukesh Ambani financial arm - Sakshi

ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. దేశంలో ఫైనాన్స్‌ వ్యాపారానికి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో ఆ రంగంలోని ప్రత్యర్థులను ఢికొట్టేందుకు  రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇటీవల డీమెర్జ్‌ అయిన జియో ఫైనాన్సియల్స్‌తో కలిసి ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇరు సంస్థల సమ భాగస్వామ్యంతో జియో బ్లాక్‌రాక్‌ అనే జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో  మొత్తం 300 మిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాతమ జాయింట్ వెంచర్  కార్యకలాపాలను ప్రారంభించనుంది. 

రిలయన్స్‌ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విడిపోయిన కొద్ది రోజులకే ఈ డీల్‌ కుదుర్చుకోవడం విశేషంగా నిలుస్తోంది. జూన్ చివరి నాటికి 9.4 ట్రిలియన్  డాలర్లు ఆస్తుల నిర్వహణలో ఉన్న బ్లాక్‌రాక్‌తో దాదాపు 20 బిలియన్ డాలర్లు మార్కెట్‌ క్యాప్‌తో ఉన్న జియో ఫైనాన్సియల్స్ డీల్‌ కీలకమైన, వ్యూహాత్మకమైన వ్యాపార నిర్ణయంగా మార్కెట్ నిపుణుల అంచనా.  (షాకిస్తున్న వెండి, బంగారం ధరలు, ఏకంగా రూ. 1100 జంప్‌)

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి భారతదేశంలో రాబోయే జాయింట్ వెంచర్ ద్వారా  ఇండియాలో తమ ఉనికిని మరింత విస్తరణకు   కృషి చేయడం చాలా  ఆనందంగా ఉందని, బ్లాక్‌రాక్‌కు ఇది కీలక అడుగు అని బ్లాక్‌రాక్ చైర్మన్, సీఈవో లారీ ఫింక్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులు, రిస్క్‌ మేనేజ్‌ మెంట్‌లో బ్లాక్‌రాక్‌ లోతైన నైపుణ్యంతో, సాంకేతిక సామర్థ్యం జియో ఫైనాన్షియల్స్‌ లోతైన మార్కెట్ నైపుణ్యం  కలగలిసి తమ  డిజిటల్ ప్రొడక్ట్స్‌ డెలివరీ బాటలు వేస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సీఈవో హితేష్ సేథియా చెప్పారు. (Maruti Jimny Into Camping Setup: మారుతి జిమ్నీని సింగిల్‌ బెడ్‌తో అలా మార్చేసిన జంట; వైరల్‌ వీడియో)

Advertisement
Advertisement