ఇండిగో విమానంలో  ‘నేషనల్‌ హీరో’: ఎయిర్‌ హోస్టెస్‌ చేసిన పనికి... | Watch: ISRO Chief S Somanath Receives Warm Welcome From IndiGo Staff And Passengers, Video Goes Viral - Sakshi
Sakshi News home page

ISRO Somanath In IndiGO Flight: ఇండిగో విమానంలో ‘నేషనల్‌ హీరో’: ఎయిర్‌ హోస్టెస్‌ చేసిన పనికి...

Published Thu, Aug 31 2023 6:04 PM

down to earth ISRO Chief Somanath in IndiGo Warm Welcom Staff And Passengers - Sakshi

ISRO Chief S Somanath: చంద్రయాన్‌ -3 సక్స్‌స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లను ప్రశంసలను దక్కించుకుంటున్నారు. చందమామ దక్షిణ ధృవంపై కాలిడిన  తొలి దేశంగా భారత్‌న తన ప్రత్యేకతను చాటుకుంది.  ఆగష్టు 23, చంద్రయాన్-3  ల్యాండర్ విక్రమ్ చంద్రుడి పరితలంపై ల్యాండ్ అయ్యి కొత్త  చరితను లిఖించింది. చంద్రయాన్‌ -3 లైవ్‌ స్ట్రీమింగ్‌ యూట్యూబ్‌లో  మోస్ట్‌ వ్యూయడ్‌ రికార్డు దక్కించుకుందనే ఈ ప్రాజెక్ట్‌పై గ్లోబల్‌గా ఉన్న ఆసక్తిని అర్థం  చేసుకోవచ్చు.

ఈ క్రమంలోనే దేశీయ విమానంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. వివరాలను పరిశీలిస్తే ఇస్రో చైర్మన్ సోమనాథ్‌ ఇండిగో విమానంలో పయనించారు. ఆయన  విమానం ఎక్కగానే  ఇండిగో సిబ్బంది,ప్రయాణీకుల నుండి అనూహ్యంగా ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా సోమనాథ్‌ను గుర్తుపట్టిన ఎయిర్‌ హోస్టెస్‌ నేషనల్‌ హీరోకి వెల్కం.. అందరూ ఆయనను ఆహ్వానించండి అంటూ గర్వంగా  ప్రకటించింది.  దీంతో ప్రయాణికులందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఇంతలో మరో ఫ్లైట్‌ ఎటెండెంట్‌ గూడీస్‌తో ఆయనను సత్కరించింది.

ఈ విషయాన్ని పూజా షా తన సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఇస్రో బృందాన్ని స్వాగతించే అవకాశం లభించినందుకు  గర్విస్తున్నామంటూ ఆమె ఇన్‌స్టాలో పేర్కొన్నారు. దీంతో  ఈ వీడియో వైరల్‌గా మారింది.  ఈసందర్భంగా ఇస్రో టీంకు అభినందనలు తెలిపారు నెటిజన్లు. అలాగే అంతటి గొప్ప వ్యక్తి  ఎంత  నిరాడంబరంగా ఉన్నారుఅంటూ కొందరు కమెంట్‌ చేశారు. 

Advertisement
Advertisement