Sakshi News home page

మూడు బ్యాంకుల కొత్త ప్రకటనలు.. ఈఎమ్ఐ కట్టే వారికి బిగ్ షాక్!

Published Sun, Aug 6 2023 7:45 AM

Icici pnb bank of india new MCLR rules - Sakshi

ప్రముఖ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ 'ఐసీఐసీఐ'తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులైన పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలకమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, మూడు బ్యాంకులు తమ 'మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ల'ను (MCLR) సవరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది బహుశా కష్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ రూల్స్ ఇప్పటికే (2023 ఆగష్టు 01) అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లు బ్యాంకులు ఇచ్చే లోన్ మీద అమలు చేసే ఒక ప్రామాణిక వడ్డీ. ఒక వేలా ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు పెరిగితే దీనికి అనుబంధంగా ఉండే వెహికల్, పర్సనల్, హోమ్ లోన్ వంటి అన్ని ఈఎమ్ఐలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)
కొత్త నిబంధనల ప్రకారం ఐసీఐసీఐ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు తెలుస్తోంది. అన్ని కాలవ్యవధులకు ఇది వర్తిస్తుందని సమాచారం. ఈ కారణంగా ఒక నెల ఎంసీఎల్‌ఆర్ రేట్లు 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. అదే సమయంలో 3 & 6 నెలల కాలానికి వరుసగా 8. 41 శాతం, 8.80 శాతానికి చేరాయి.

ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)
ఇప్పటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్ రేట్లు యధాతధంగా ఉన్నట్లు సమాచారం. కావున బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ 8.10 శాతంగా ఉంది. ఇక ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ వరుసగా 8.20 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 హైబ్రిడ్ కార్లు - వివరాలు

బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India)
ఇక చివరగా బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే.. ఇది కూడా కొత్త నిర్ణయాలను అమలు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్ రేట్లు 7.95 శాతం ఉండగా.. ఒక నెల, మూడు, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ రేట్లు వరుసగా 8.15 శాతం, 8.30 శాతం, 8.50 శాతంగా ఉంది.

Advertisement
Advertisement