ల్యాబ్‌ డైమండ్లతో ఉపాధికి ఊతం | Sakshi
Sakshi News home page

ల్యాబ్‌ డైమండ్లతో ఉపాధికి ఊతం

Published Fri, Aug 25 2023 4:18 AM

Lab diamonds help create jobs says Commerce and industry minister Piyush Goyal  - Sakshi

జైపూర్‌: ల్యాబ్‌లలో తయారు చేసే వజ్రాలు (ఎల్‌జీడీ) కృత్రిమమైనవి కావని, వాటికి కూడా ప్రస్తు తం సహజ వజ్రాలుగా ఆమోదయోగ్యత పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ తెలిపారు. ఇలాంటి సానుకూల పరిణామాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడగలవని, దీనితో ఉపాధి కల్పనకు కూడా ఊతం లభించగలదని ఆయన చెప్పారు.

ఎల్‌జీడీల తయారీలో సౌర, పవన విద్యుత్‌ వంటి వనరులను వినియోగించడం వల్ల ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైనదని మంత్రి తెలిపారు. జూన్‌ 22న అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7.5 క్యారట్ల ఎల్‌జీడీని అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు బహూకరించడం ల్యాబ్‌ డైమండ్లకు పెరుగుతున్న ఆమోదయోగ్యతకు నిదర్శనం. ఎల్‌జీడీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్‌జీ డీ సీడ్స్‌పై 5% కస్టమ్స్‌ సుంకాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

అలాగే, దేశీ యంగా ఎల్‌జీడీ యంత్రాలు, సీడ్స్, తయారీ విధానాన్ని రూపొందించడంపై పరిశోధనలు చేసేందుకు ఐఐటీ–మద్రాస్‌కు రీసెర్చ్‌ గ్రాంట్‌ ప్రకటించింది. 2025 నాటికి ఎల్‌జీడీ ఆభరణాల మార్కెట్‌ 5 బిలియన్‌ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2021 –22లో కట్, పాలిష్డ్‌ ఎల్‌జీడీల ఎగుమతులు 1.35 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, గతేడాది ఏప్రిల్‌–డిసెంబర్‌ వ్యవధిలో 1.4 బిలియన్‌ డాలర్ల స్థాయిలో నమోదైంది.   
 

Advertisement
Advertisement