పేటీఎంకు భారీ ఊరట.. ఇకపై యథావిధిగా ప్రముఖ సేవలు.. కానీ.. | Sakshi
Sakshi News home page

పేటీఎంకు భారీ ఊరట.. ఇకపై యథావిధిగా ప్రముఖ సేవలు.. కానీ..

Published Fri, Mar 15 2024 1:51 PM

NPCI Approves Paytm To Participate In UPI As A TPA provider - Sakshi

పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు భారీ ఊరట లభించింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్‌ (టీపీఏపీ) లైసెన్స్‌ను ఇటీవల మంజూరు చేసింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్‌ మోడల్‌ కింద ఇకపై పేటీఎం బ్రాండ్‌పైనా యూపీఐ సేవలందిస్తుంది. 

లైనెన్స్‌లో వివరాల ప్రకారం..బ్యాంకింగ్‌ సేవలిందిస్తున్న యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యస్‌ బ్యాంక్‌లు ఇకపై పేటీఎంకు పేమెంట్‌ సిస్టమ్‌ ప్రొవైడర్‌ బ్యాంక్స్‌గా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఉన్న మర్చంట్స్‌కు, కొత్త మర్చంట్స్‌కు యస్‌ బ్యాంక్‌ ఇకపై సేవలందిస్తుంది. అంటే @paytm యూపీఐ హ్యాండిల్‌ కలిగిన మర్చంట్‌ పేమెంట్స్‌ ఇకపై యస్‌ బ్యాంక్‌కు రీడైరెక్ట్‌ అవుతాయి.

ఇదీ చదవండి: పెళ్లి ఖర్చు తగ్గడానికి బెస్ట్‌ ప్లాన్‌..! చాలా డబ్బు ఆదా..

ప్రస్తుతం ఉన్న యూజర్లు, మర్చంట్లు తమ యూపీఐ లావాదేవీలు, ఆటో పే మ్యాండెట్లను ఎలాంటి అవాంతరం లేకుండా వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం వీలు పడుతుందని ఎన్‌పీసీఐ తెలిపింది. పేటీఎం కూడా కొత్త పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ బ్యాంకులకు తమ హ్యాండిళ్లను మైగ్రేట్‌ చేయాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు, మర్చంట్స్‌ మార్చి 15లోగా తమ అకౌంట్లను వేరే బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించిన నేపథ్యంలో ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement