Paytm Q1 Results: More than 50% growth in the number of loan disbursements - Sakshi
Sakshi News home page

క్యూ1లో పేటీఎమ్‌ జోరు: జీఎంవీ 37 శాతం జూమ్‌ 

Published Thu, Jul 6 2023 10:12 AM

Paytm Q1results More than 50pc growth - Sakshi

న్యూఢిల్లీ: పేటీఎమ్‌ బ్రాండు ఫిన్‌టెక్‌ దిగ్గజం వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించింది. ఏప్రిల్‌-జూన్‌(క్యూ1)లో స్థూల వాణిజ్య విలువ(జీఎంవీ) 37 శాతం జంప్‌చేసి రూ. 4.05 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది (2022-23) క్యూ1లో రూ. 2.96 లక్షల కోట్లుగా నమోదైంది. కంపెనీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వ్యాపారస్తుల(మర్చంట్స్‌)కు జరిగిన చెల్లింపుల విలువను జీఎంవీగా పేర్కొనే సంగతి తెలిసిందే. (రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం రామ్‌కీ దూకుడు: ఈసారి రూ. 2 వేల కోట్ల బుకింగ్స్‌)

కాగా.. పేటీఎమ్‌ ద్వారా పంపిణీ అయిన రుణాలు 2.5 రెట్లు ఎగసి రూ. 14,845 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది క్యూ1లో రూ. 5,554 కోట్ల రుణాలు పంపిణీకాగా.. వీటి పరిమాణం సైతం 85 లక్షల నుంచి 51 శాతం జంప్‌చేసి 1.28 కోట్లకు చేరినట్లు తెలియజేసింది.  

మరిన్ని బిజినెస్‌ వార్తలు అప్‌డేట్స్‌ కోసం చదవండి: సాక్షిబిజినెస్‌
 

Advertisement

తప్పక చదవండి

Advertisement