స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో భారత్ హవా.. ఎక్కువ ఆ దేశానికే! | Sakshi
Sakshi News home page

Smartphones: స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో భారత్ హవా.. ఎక్కువ ఆ దేశానికే!

Published Thu, Aug 3 2023 3:41 AM

US biggest export destination for Indian smartphones in April-May - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌ నుంచి యూఎస్‌కు జరుగుతున్న స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో కొత్త రికార్డు నమోదైంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–మే నెలలో దేశీయంగా తయారైన రూ.6,679 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు యూఎస్‌కు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.758 కోట్లుగా ఉంది. భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో విలువ పరంగా యూఎస్‌ మూడవ స్థానంలో ఉంది.

ఇక మొత్తం ఎగుమతులు ఏప్రిల్‌–మే నెలలో అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 158 శాతం అధికమై రూ.19,975 కోట్లు నమోదయ్యాయి. యూఏఈకి రూ.3,983 కోట్లు, నెదర్లాండ్స్‌కు రూ.1,685 కోట్లు, యూకే మార్కెట్‌కు రూ.1,244 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు సరఫరా అయ్యాయి.

ఇటలీ, చెక్‌ రిపబ్లిక్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2022–23లో భారత్‌ నుంచి వివిధ దేశాలకు చేరిన స్మార్ట్‌ఫోన్ల విలువ రూ.90,009 కోట్లు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ప్రకటించడం, యుఎస్‌కు చెందిన ఆపిల్‌ దేశీయంగా తయారీలోకి ప్రవేశించిన తర్వాత స్మార్ట్‌ఫోన్లకు ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా భారత్‌ అవతరిస్తోంది.

Advertisement
Advertisement