11న ప్రియాంకా గాంధీ సభ | Sakshi
Sakshi News home page

11న ప్రియాంకా గాంధీ సభ

Published Wed, May 8 2024 6:10 AM

11న ప

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డిలో ఈనెల 10న నిర్వహించాల్సిన ప్రియాంక గాంధీ బహిరంగ సభ 11వ తేదీకి వాయిదా పడిందని ఏఐసీసీ సెక్రెటరీ విష్ణునాథ్‌ తెలిపారు. సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ గోల్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు. మోదీ నియంత పాలనను అంతమొందించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడానికి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, జహీరాబాద్‌ పార్లమెంట్‌ సమన్వయ కర్త, కేరళ ఎంపీ రాజామోహన్‌ పున్నన్‌ తదితరులు పాల్గొన్నారు.

పతి కోసం సతి ప్రచారం

దోమకొండ: మండల కేంద్రంలో మంగళవా రం సాయంత్రం జహీరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ భార్య అరుణ పాటిల్‌ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధిని వివరించారు. కమలం పువ్వు గుర్తు కు ఓటేసి బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. ఆమె వెంట బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కంది మనోజ్‌కుమార్‌, మోహన్‌రెడ్డి ఉన్నారు.

విద్యుత్‌కు అంతరాయం

దోమకొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మూడు గంటల పాటు విద్యుత్‌ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బలమైన గాలుల వల్ల విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో సమస్య ఏర్పడదిందని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు.

కొనసాగుతున్న

కళాశాలల తనిఖీ

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సి టీ పరిధిలో అనుబంధ గుర్తింపు తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం నవీపే ట్‌లోని మేధా డిగ్రీ కాలేజీ, బోధన్‌లోని ఉషోదయ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, విజయసాయి మహిళా డిగ్రీ కాలేజీ, ఎస్‌వీ, ఉషోదయ మ హిళా డిగ్రీ కాలేజీ, ఎంఐఎంఎస్‌, ఇందూరు డిగ్రీ కళాశాలలు తనిఖీ చేసినట్లు వర్సిటీ అ కడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. సరైన సౌకర్యాలు లేని కళాశాలలకు నోటీసులు అందించినట్లు తెలిపారు. విజయసాయి ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీలో కనీ సం టేబుల్స్‌ సైతం లేకపోవడంతో కాళ్లపైనే రిజిస్టర్లు పెట్టుకుని తనిఖీ చేయాల్సి రావడంతో వర్సిటీ అధికారులు అసహనానికి లోనయ్యారు. ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అతిక్‌ సుల్తాన్‌ ఘోరీ, డీన్లు ఆరతి, రాంబా బు, లావణ్య, ఆంజనేయులు పాల్గొన్నారు.

11న ప్రియాంకా గాంధీ సభ
1/2

11న ప్రియాంకా గాంధీ సభ

11న ప్రియాంకా గాంధీ సభ
2/2

11న ప్రియాంకా గాంధీ సభ

Advertisement
 
Advertisement
 
Advertisement