Bengaluru: మొబైల్‌ ఫోన్‌ కోసం విదేశీ మహిళ హత్య | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ఫోన్‌ కోసం విదేశీ మహిళ హత్య.. పోలీసుల అదుపులో నిందితులు

Published Sat, Mar 16 2024 12:04 PM

Bengaluru Police Arrested Two Persons In Uzbekistan Woman Murder  - Sakshi

బెంగళూరు: ఉజ్బెకిస్తాన్ మహిళ జరీనా(37) హత్య కేసులో రాబర్ట్‌, అమృత్‌ సోను అనే ఇద్దరిని బెంగళూరు శేషాద్రిపురం  పోలీసులు అరెస్టు చేశారు. మొబైల్‌ ఫోన్‌, విదేశీ కరెన్సీ కోసమే జరీనాను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.  హోట్‌ల్‌ సీసీటీవీ కెమరాల ఫుటేజిని పరిశీలించి కేసును పోలీసులు చేధించారు.

బెంగళూరులోని జగదీష్‌ హోటల్‌లో జరీనా బుధవారం హత్యకు గురైంది. హత్య కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితులిద్దరు జరీనా స్టే చేసిన హోటల్‌లోనే హౌస్‌కీపింగ్‌ విభాగంలో పనిచేస్తున్నారు. నిందితులిద్దరూ అస్సోంకు చెందిన వారే. జరీనాను హత్య చేసిన అనంతరం రూమ్‌ లాక్‌ చేసి వీరిద్దరూ కేరళ పారిపోయారు. విచారణసమయంలో ఉజ్బెకిస్తాన్‌ కరెన్సీని పోలీసులు నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

ఇదీ చదవండి.. ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడీ రాకెట్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement