యూఎస్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..! | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం..గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!

Published Tue, Apr 23 2024 1:50 PM

Bird Flu Outbreak In US: Should You Eat Eggs Chicken And Milk - Sakshi

ఆవు పాలల్లో  బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్‌  అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే  పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్‌  ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్  నాశనమవుతోందని  నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో  కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్‌ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో  తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..!

ఈ బర్డ్‌ ఫ్లూ వైరస్‌ని ఏవియన్‌ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్‌ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్‌ ఉక రకాల ఏ(హెచ్‌5ఎన్‌1), ఏ(హెచ్‌9ఎన్‌2) వల్ల వస్తుంది. ఈ హెచ్‌5ఎన్‌1 వైరస్‌ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ఇలా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ‍ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం..బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. 

గుడ్లు..
గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. 

పాలు..
ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

చికెన్‌
ఈ వైరస్‌ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్‌ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని  165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్‌తో సహా ఇతర వైరస్‌లు నశించడం జరుగుతుంది. అలా చికెన్‌ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే
చివరిగా బర్డ్‌ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

  • జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది.
  • దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది.
  • గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది.
  • కండరాల నొప్పులు: శరీర నొప్పులు 
  • తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది.
  • శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి.

ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు..

  • న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది.
  • అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం 
  • అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది.
  • వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు.
  • ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది.
  • నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. 

(చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!)


 

Advertisement

తప్పక చదవండి

Advertisement