ఓటర్ల సౌలభ్యం కోసం ‘చాట్‌ బాట్‌’ యాప్‌ | Sakshi
Sakshi News home page

ఓటర్ల సౌలభ్యం కోసం ‘చాట్‌ బాట్‌’ యాప్‌

Published Tue, May 7 2024 6:25 AM

-

హన్మకొండ అర్బన్‌ : ఎన్నికలకు సంబంధించిన పలు వివరాలు తెలుసుకునేందుకు ఓటర్ల సౌలభ్యం కోసం వాట్సాప్‌కు సంబంధించిన ‘చాట్‌ బాట్‌’ యాప్‌ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు హనుమకొండ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తెలిపారు. దీనిని ఉపయోగించేందుకు క్యూఆర్‌ కోడ్‌ లేదా 97045 60805 నంబర్‌ను సంప్రదించాలన్నారు. తద్వారా ఓటర్‌ హెల్ప్‌లైన్‌తో పాటు ఎన్నికలకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ యాప్‌లో మొదట హాయ్‌ అని సందేశం పంపించాలని, అలా సందేశం పంపిన వెంటనే వాట్సాప్‌లో ఓటర్‌ హెల్ప్‌లైన్‌, పీడబ్ల్యూడీ హెల్ప్‌లైన్‌, పోలింగ్‌ బూత్‌ వివరాలు అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయన్నారు. పీడబ్ల్యూడీ హెల్ప్‌లైన్‌లో గూగుల్‌ లింక్‌ను ఉపయోగించి వీడియో కాల్‌ చేయడం ద్వారా ఎలక్షన్‌ కంట్రోల్‌ రూమ్‌లోని అధికారులతో నేరుగా రోజు (ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) మాట్లాడే అవకాశం ఉంటుందని, బధిరుల కోసం కంట్రోల్‌ రూమ్‌లో సైన్‌ లాంగ్వేజ్‌ ద్వారా కూడా సమాచారం తెలిపేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన సందేశాలు, ఆకర్షణీయమైన ఫొటోలు voter-spointh-nk.in అనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చని పేర్కొన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థులు, అధ్యాపక బృందం రూపొందించిన ఈ యాప్‌ను ఓటర్లు సద్వినియోంచుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement